నవరాత్రి మొదటి రోజున మారుతి సుజుకి రిటైల్ అమ్మకాలలో రికార్డు సృష్టించింది. ఏకంగా 30 వేల మార్క్ ను రీచ్ అయినట్లు వెల్లడించింది. పండుగ డిమాండ్ తో పాటు GST 2.0 కారణంగా రేట్లు తగ్గడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. పండుగకు ముందు GST సంస్కరణలు రావడంతో సానుకూల ఊపుతో పాటు, నవరాత్రి ప్రారంభం ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త ఆశలు నింపింది. తగ్గిన GST రేట్లు ప్రయాణీకుల, వాణిజ్య వాహనాల ధరలను తగ్గించినందున దేశ వ్యాప్తంగా డీలర్ షిప్‌లు అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను కనబరుస్తున్నాయి. కార్ల ధరలు తగ్గడంతో కొనుగోలు దారులు కొత్త కార్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. మారుతి సుజుకి 30 వేల యూనిట్లను అమ్మగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దాదాపు 11,000 డీలర్ బిల్లింగ్ లను సాధించింది. ఇది ఐదు సంవత్సరాలలో దాని బెస్ట్ సింగిల్ డే పనితీరును సూచిస్తుంది. ఈ పెరుగుదల బలమైన పండుగ సెంటిమెంట్, కస్టమర్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలో అతిపెద్ద ఆటోమేకర్ అయిన మారుతి సుజుకి సోమవారం భారీ సంఖ్యలో కస్టమర్లు తమ షోరూమ్ లను సందర్శించారు. మొత్తం 80,000 ఆయా కార్లకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఇది కంపెనీకి కార్ల పట్ల గత 35 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయి ఆసక్తిని సూచిస్తుంది. అటు ఇప్పటి వరకు మొత్తం 75,000 బుకింగ్‌లు జరిగాయి. ST 2.0 ప్రకటన తర్వాత రోజువారీ 15,000 కొత్త బుకింగ్‌లు పెరిగాయి.
GST 2.0 ప్రవేశపెట్టడం వల్ల మారుతి సుజుకికి చిన్న కార్ల బుకింగ్ లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఎంట్రీ-లెవల్ వాహనాలకు డిమాండ్‌లో గణనీయమైన 50% పెరుగుదల కనిపించింది. ఇది వినియోగదారులలో మరింత సరసమైన ఎంపికల వైపు మళ్లించేలా చేసింది. ఈ డిమాండ్ తో కొన్ని మోడళ్ల స్టాక్ లు త్వరగా తగ్గిపోతున్నాయని డీలర్లు వెల్లడించారు. కస్టమర్లకు కార్లను సకాలంలో డెలివరీ చేసేలా చూసుకోవడానికి అనేక డీలర్ షిప్ లు రాత్రిపూట తమ పని గంటలను పొడిగించాయి.
Read Also: ఫ్లిప్ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!
పండుగ సీజన్, పన్ను తగ్గింపులు దేశంలోని ఇతర ఆటోమేకర్లను కూడా సానుకూలంగా ప్రభావితం చేశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ 10,000 కార్లను డెలివరీ చేసింది. 25,000 విచారణలను అందుకుంది. అదేవిధంగా హ్యుందాయ్ 11,000 యూనిట్లను బిల్ చేయడం ద్వారా ఐదు సంవత్సరాలలో అత్యుత్తమ సింగిల్-డే అమ్మకాలను నమోదు చేసింది. వాహనాల ధరల తగ్గింపు చిన్న కార్ల బుకింగ్‌లలో 50% పెరుగుదలకు దారితీసింది. కార్ డీలర్లు నెక్ట్స్ జెనరేషన్ GST సంస్కరణలను స్వాగతించారు. ఇటువంటి మార్పులు కొనుగోలు శక్తిని పెంచుతాయని, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రేరేపిస్తాయని వెల్లడించారు.
Read Also: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!