Tamannah: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం హ్యాపీడేస్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి తమన్నా(Tamannaah). ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్న తమన్న మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తమన్నా కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర సినిమాలలో స్పెషల్ సాంగ్స్(Special Songs) కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే తమన్న ఎన్నో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవడమే కాకుండా భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా స్పెషల్ సాంగ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. తాను సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాను అంటే అందుకు కారణం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) కారణమని తెలిపారు. అల్లు అర్జున్ వల్లే నేను ఈరోజు స్పెషల్ సాంగ్స్ చేయగలుగుతున్నాను.
బన్నీ వల్లే స్పెషల్ సాంగ్స్..
అల్లు అర్జున్ తో కలిసి తమన్నా బద్రీనాథ్ (Badrinath) సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా అల్లు అర్జున్ కు పోటీగా తన డాన్స్ తో అదరగొట్టారు. అప్పటివరకు డాన్స్ చేయడానికి తాను కాస్త మొహమాట పడేదాన్ని కానీ అల్లు అర్జున్ మాత్రం తనతో సమానంగా డాన్స్ చేయడం కోసం డైరెక్టర్ ను ఒప్పించి ఈ సినిమాలో తనతో డాన్స్ చేయించారని తెలిపారు. ఇక బద్రీనాథ్ సినిమా తర్వాత తాను ఎంతో ధైర్యంగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నానని, ఇదంతా బన్నీ వల్లే అంటూ తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అమెజాన్ లో డూ యు వన్నా పార్టనర్..
ఇక తమన్నా ప్రస్తుతం సౌత్ సినిమాల కంటే కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇలా బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తాజాగా ఈమె “డూ యు వన్నా పార్టనర్” (Do You Wanna Partner) అనే సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 12 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌లో ఆమె డయానా పెంటీతో కలిసి నటించారు. ప్రమోషన్లలో భాగంగానే ఈమె ఈ విషయాలన్నింటినీ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక తమన్న వ్యక్తిగత విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది .ఈ బ్రేకప్ వార్తలపై తమన్నా ఎక్కడ స్పందించకపోయిన సోషల్ మీడియాలో వీరి ఫోటోలను డిలీట్ చేయడంతో బ్రేకప్ నిజమేనని తెలుస్తుంది.
Also Read: Reba Monica: రజనీకాంత్ తో సినిమా.. నిరాశ మాత్రమే మిగిలిందన్న నటి..ఏమైందంటే?