OG Tickets : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా రేపు విడుదల బాగుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో పలుచోట్ల ఈ సినిమాకి సంబంధించి షోస్ స్టార్ట్ కానున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు కావాలి అంటే ముందు రోజు రాత్రి నుంచి టికెట్ కౌంటర్ లో క్యూలు కట్టేవాళ్ళు. అయినా కూడా టికెట్లు దొరుకుతాయి అని నమ్మకం ఉండేది కాదు. టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం దొరికింది.
అయితే ప్రస్తుతం బుక్ మై షో లో కూడా స్కామ్స్ మొదలైపోయాయి. చాలా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచడం. కొన్ని సినిమాలకు పెయిడ్ కామెంట్స్ ఉండడం ఇది సాధారణంగా జరుగుతుంది. వీటన్నిటిని మించి ఒక పెద్ద హీరో సినిమా విడుదలవుతున్నప్పుడు ఈ యాప్స్ చేసే అరాచకాలు మామూలుగా. సినిమా టికెట్లు కనిపిస్తాయి గానీ బుక్ చేస్తే అవ్వవు.
అయితే హైదరాబాదులో ఉన్న పీవీఆర్ థియేటర్స్ యాజమాన్యంపై పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవపడ్డారు. టికెట్స్ ఉండి కూడా బ్లాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సర్వర్ ఓపెన్ చేసి చూపించాలి అంటూ చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు యాజమాన్యంపై ఎదురు తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు ట్విట్టర్లో వైరల్ గా మారాయి.
Cults Godava At PVR
For #OG Tickets 😅💥#TheycalllHimOG pic.twitter.com/RHetZCaR92
— 𝐒𝐊𝐘 #𝐎𝐆 🐦🔥 (@SKY___63) September 24, 2025
మరోవైపు ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాపులర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్స్ కూడా దొరకడం లేదు. హైదరాబాదులో ఉన్న సంధ్య, శ్రీరాములు వంటి ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ టికెట్ రేట్లు దాదాపు 2000 నుంచి 3000 వరకు బయట అమ్మడం మొదలుపెట్టారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడం నేరం అనుకుంటే థియేటర్లో ఒకటి కూడా ఇవ్వకుండా ఇలా బయట అమ్ముకోవడం అనేది దారుణం.
ఇలాంటి దారుణాలు ఎన్ని జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం డబ్బుల విషయం ఆలోచించకుండా భారీ రేట్లు పెట్టి టికెట్లు కొంటున్నారు. హైదరాబాద్లో దాదాపు అన్ని థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ఇప్పుడు అర్థమవుతుంది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా కొత్త రికార్డులు చూసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మాదిరిగానే సుజిత్ కి కూడా మంచి ఎలివేషన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Also Read: OG Film : రాజమౌళి, ప్రశాంత్ నీల్, అకిరానందన్.. ఈ రాత్రికి ఇండస్ట్రీ మొత్తం ఆ థియేటర్లోనే!