YS Jagan: రాష్ట్రంలో చంద్రబాబు పాలన దారుణంగా ఉందని.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే వారిని భవిష్యత్తులో ఏం చేయాలో తమకు బాగా తెలుసనని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో వైసీపీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్ డిజిటల్ బుక్ యాప్‌ను లాంచ్ చేశారు.
కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ లాంచ్..
‘కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేస్తున్నాం.. రాష్ట్రంలో ఎవరికీ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు.. ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యా్ప్తు చేయిస్తాం.. సప్త సముద్రాల అవతల ఉన్నా వారిని తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తాం.. రెడ్ బుక్ అంటున్నారు.. ముందు ముందు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం.. 14 ఏళ్లలో కార్యకర్తలు పార్టీకి గ్రామాల్లో అండగా ఉన్నారు. కార్యకర్తల కారణంగానే పార్టీకి 40 శాతం ఓటు బ్యాంక్ వచ్చింది.. నాయకులుగా కార్యకర్తలకు దగ్గర కావాలి.. వారిని నడిపించాలి.. సంక్రాంతి నాటికి ఐడీ కార్డులు జారీ చేస్తాం.. ఐడీ కార్డు ఉన్న ప్రతి కార్యకర్త డేటా పార్టీ ఆఫీసులో ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు న్యాయం చేస్తాం. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటే చంద్రబాబు ఎప్పటికీ మనల్ని ఓడించలేరు’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
సూపర్ 6 ఎక్కడపోయింది..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవీ రాష్ట్రంలో అమలు కావడం లేదు. అధికారంలోకి రాక ముందు సూపర్ 6 పేరుతో జనాలను నమ్మించారు. పథకాలు ఏమీ అమలు చేయకుండా చేసేశా అనడం ఏంటని ప్రశ్నించారు. దీనికి విజయోత్సవాలు జరపడం ఏంటి..? ప్రపంచంలో ఇలా ఏ పార్టీ చేసి ఉండదు. అమలు చేసిన పథకాలు కూడా అందరికీ ఇవ్వలేదు.. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారు. మా హయాంలో రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా..? బ్లాక్ మార్కెట్లతో ప్రభుత్వమే చేతులు కలిపింది’ అని జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
రైతులను కాపాడుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం..
‘ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో.. రైతులను కాపాడుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది.. ఎన్నికలప్పుడు ప్రచారం వేరు.. ఇప్పుడు వీరు చేస్తున్న ప్రచారం వేరు.. ఆడబిడ్డ నిధి అనే పథకం అసలు కనిపించడం లేదు.. అప్పట్లో ఇచ్చిన హామీలేవి అమలు కావడం లేదు.. పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిల్లో లేరని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ధాన్యం గిట్టు బాటు ధర ఉండదని చెప్పకనే చెబుతున్నారు.. చంద్రబాబు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏ పంటకైనా గిట్టుబాటు దొరకుతుందా’ అని ప్రశ్నించారు.
ALSO READ: Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..
మెడికల్ కాలేజీలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టలేరా..?
‘అమరావతిలో రూ.లక్ష కోట్ల ఖర్చు పెడతామంటున్నారు.. 50వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం అమరావతికి లక్షల కోట్లు పెడతారట.. ఇంకో 50వేల ఎరాలు కావాలంటున్నారు.. మరో లక్ష కోట్లు కావాలట.. మెడికల్ కాలేజీలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టలేరా..? విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉంది.. అవినీతి రాజ్యమేలుతోంది.. మద్యం, ఇసుక, క్వార్ట్స్, మట్టి మాఫియా పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ లు జరుగుతున్నాయి.
ALSO READ: Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు