E-Paper
Advertisement

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?
Advertisement

Samantha: సాధారణంగా సెలబ్రిటీలు ఎలాంటి లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వారి హుందాతనం.. వారు ఉపయోగించే వస్తువులు.. వారి లగ్జరీని చూపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమకు ఇష్టమైన వస్తువుల కోసం లక్షలు కాదు కాదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ వాటిని కొనుగోలు చేసి.. అప్పుడప్పుడు ధరిస్తూ ఉంటారు. అలా ధరించిన వస్తువులతో మరోసారి వైరల్ గా మారుతూ ఉంటారు. అలాంటి వారిలో సమంత (Samantha)కూడా ఒకరు. ఈ మధ్య ఎక్కువగా పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా మారిన ఈమె.. అందులో భాగంగానే ఒక వాచ్ ను ధరించి ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు పంచుకుంది. దీంతో ఆ ఫోటోలలో ఆమె పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

సమంత ధరించిన వాచ్ ఖరీదు ఎంతంటే?

ఈ క్రమంలోనే సమంత ధరించిన ఆ వాచ్ ఏ కంపెనీది..? దాని ధర ఎంత ? అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా మరో కొన్ని గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. అయితే అందులో ఆమె చేతికి ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ వాచ్ గురించి పలు విషయాలు వైరల్గా మారుతున్నాయి. మరి సమంత పెట్టుకున్న వాచ్ విషయానికి వస్తే.. ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ ను సమంత తన చేతికి ధరించింది. దీని విలువ సుమారుగా రూ.30 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. దీని విలువ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత తన బ్రాండ్ ని చూపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సమంత కెరియర్..

సమంత విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. టాలీవుడ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన సమంత.. నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించింది.బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాతే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే విడిపోయారు అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడిపోవడం వెనుక అసలు కారణం మాత్రం ఇప్పటికీ తెలియలేదని చెప్పాలి.

Advertisement

సమంత సినిమాలు..

ప్రస్తుతం సమంత సినిమాల విషయానికొస్తే.. ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈమెతో సమంత ఇదివరకే ‘ఓ బేబీ’ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మరొకవైపు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా మొన్నటి వరకు ఫైనాన్షియల్ గా ఆగిపోయిందని వార్తలు వచ్చినా ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మొత్తానికైతే ఇప్పుడు సమంత మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

also read:OG Bookings : ఓజీ కోసం మరో మూవీ త్యాగం… థియేటర్స్ అన్నీ ఇచ్చేశారు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×