BigTV English

OG Bookings : ఓజీ కోసం మరో మూవీ త్యాగం… థియేటర్స్ అన్నీ ఇచ్చేశారు

OG Bookings : ఓజీ కోసం మరో మూవీ త్యాగం… థియేటర్స్ అన్నీ ఇచ్చేశారు

OG Bookings :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా నటిస్తున్న చిత్రం ఓజీ(OG). సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్(Priyanka Mohan )హీరోయిన్ గా నటించింది. శ్రేయా రెడ్డి, శుభలేఖ సుధాకర్ , ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈరోజు రాత్రికి ప్రీమియర్ షోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటిరోజు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా రెండు సినిమాలు త్యాగం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


OG కోసం రెండు చిత్రాలు త్యాగం..

అసలు విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన అనుష్క ‘ఘాటీ’ చిత్రం తోపాటు 90’స్ బయోపిక్ ఫేమ్ మౌళి (Mouli ) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ . ఘాటీ తో పోల్చుకుంటే లిటిల్ హార్ట్స్ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా థియేటర్లలో ఫుల్ రన్ తో ఇప్పటికీ రన్ అవుతూ అటు నిర్మాతలకు కూడా భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.. అయితే ఇలాంటి సమయంలో ఓజీ కోసం ఈ రెండు చిత్రాలను పక్కకు పెట్టినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే… ఈరోజు రాత్రికి ఓజీ ప్రీమియర్ షోలు వేస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న ఈ చిత్రాలను తీసివేసి.. ఓజీ సినిమాను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

లిటిల్ హార్ట్స్ థియేటర్స్ లో OG..


ఇకపోతే అనుష్క ఘాటీ సినిమాను పక్కన పెడితే.. లిటిల్ హార్ట్స్ సినిమాకి మంచి ప్రేక్షక ఆదరణ లభిస్తోంది. ఇలాంటి సమయంలో ఓజీ సినిమా కోసం ఈ సినిమాను థియేటర్ల నుంచి తప్పించడం ఆశ్చర్యంగా మారింది. పైగా ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “ఇప్పటివరకు మేము ఓజీ సినిమాకు సహకరించాము. ఇప్పుడు అన్ని లిటిల్ హార్ట్స్ థియేటర్లలో ఓజీ ప్రీమియర్ షోల కోసం మా లిటిల్ హార్ట్స్ కంపెనీ దారులకు ఒక అభ్యర్థన చేస్తున్నాము. దయచేసి అందరూ సహకరించండి. ఓజీ ప్రీమియర్లకు గరిష్ట మద్దతును అందించండి. పవర్ స్టార్ మూవీని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం” అంటూ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

OG కోసం బడా స్టార్స్..

మొత్తానికి అయితే నిర్మాత బన్నీ వాసు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓజీ సినిమా కోసం ఏకంగా రెండు సినిమాలకు అన్యాయం చేస్తున్నారు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం పెద్ద పెద్ద బడా హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఈ సినిమా కోసం వచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఇంత భారీ ప్రమోషన్ ఇప్పటివరకు ఎక్కడ జరగలేదనే చెప్పాలి. మరి ఇంత ప్రమోషన్స్ మధ్య ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Also read: Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Related News

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు

Reba Monica: రజనీకాంత్ తో సినిమా.. నిరాశ మాత్రమే మిగిలిందన్న నటి..ఏమైందంటే?

OG Premiere Show : ఓజీ టైం… గుంటూరు కారం గుర్తొస్తుంది గురు

Pawan Klayan OG: ఓజీ వచ్చేది నేడే… పవన్ ముందన్న సవాళ్లు ఇవే

Akira Nandan in OG: సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్

OG Tickets : పీవీఆర్ థియేటర్ యాజమాన్యంతో పవన్ ఫ్యాన్స్ గొడవ.. అసలు ఏమైంది?

Big Stories

×