Bigg Boss 9:ఎప్పటిలాగే ఈసారి కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కూడా గ్రాండ్ గా ప్రారంభం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 6 మంది సామాన్యులు హౌస్ లోకి అడుగుపెట్టారు. అటు 9 మంది సెలబ్రిటీలు సత్తా చాటడానికి వచ్చేసారు. అందులో భాగంగానే ఈ సీజన్ 9 లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా సామాన్యుల కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన వారిపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో ప్రియా శెట్టి (Priya Shetty) కూడా ఒకరు. కామనర్ కోటాలో హౌస్ లోకి వచ్చిన ఈమె గొంతుపై రకరకాల ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులు స్పందించారు.
తాజాగా ఒక ఛానల్ తో భేటీ అయిన ప్రియా శెట్టి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. “మేము బిగ్ బాస్ షో కి వద్దని చెప్పినా ప్రియా వినలేదు. బాగా ఆడతానంటూ వెళ్ళింది. అగ్నిపరీక్ష ప్రోగ్రాంలో ఆడియన్స్ ఆమెకు బాగా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడేమో ఆమె గొంతుపై ఇలా మాట్లాడుతున్నారు. మాకు చాలా బాధగా ఉంది. ఇలాంటివి ఉంటాయని.. మేము బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొద్దని చెప్పాము. కానీ తను వినలేదు. నిజానికి అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు చాలామంది ఆమె వాయిస్ స్వీట్ గా ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకో అందరికీ నచ్చట్లేదు. ఆమెకు పుట్టుక నుంచి గొంతు అంతే.. దేవుడు ఇచ్చిన గొంతును ఇప్పుడు ఏం చేయలేం కదా.
దయచేసి ఆటను మాత్రమే చూడండి..
ఆమె ఆటను మాత్రమే చూడండి.. బిగ్ బాస్ కు వెళ్తే ఆమె పెళ్లికి ఎఫెక్ట్ పడుతుందేమో అని అందరూ అంటున్నారు. మేము అలాంటి భయం పెట్టుకోలేదు. ఆమెను అర్థం చేసుకునే వ్యక్తికే ఇచ్చి ఆమెకు వివాహం జరిపిస్తాము. తను బాగా ఆడుతోంది. అందరితో కలిసిమెలిసి కనిపిస్తోంది. దయచేసి ఆమె గొంతుపై విమర్శలు గుప్పించకండి” అంటూ ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియా శెట్టి తల్లిదండ్రులు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఫైనల్స్ కి వెళ్లే అవకాశం..
ప్రియా శెట్టి విషయానికి వస్తే.. హౌస్ లో కాస్త చలాకీగా ఉన్న అమ్మాయిలలో ఈమె ప్రథమ స్థానంలో ఉంటుంది. అన్ని విషయాలలో తలదూరుస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అలాంటి ఈమెపై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం నిజంగా బాధాకరమని, ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రియా శెట్టి గనుక బలంగా ఆడితే ఫైనల్ వరకు వెళ్లే అవకాశం ఉంటుందని.. ఇలా ఫైనల్ వరకు వెళ్లాలి అంటే ముందు అందరితో గొడవలు పెట్టుకోవడం మానేయాలి అని కూడా సలహాలు ఇస్తున్నారు.
Also read:Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!