BigTV English
Advertisement

Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?

Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు(Bucchi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనులను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి… చికిరి సాంగ్ విడుదల చేయడంతో ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం రాంచరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.


సందీప్ రెడ్డితో చరణ్ సినిమా లేనట్లేనా?

త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత చరణ్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన బోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. నిజానికి పెద్ది సినిమా తర్వాత రాంచరణ్ సుకుమార్(Sukumar) సినిమా పనులలో బిజీ కావాల్సి ఉంది కానీ ఈ సినిమాకి కూడా బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. పెద్ది సినిమా విడుదలైన అనంతరం రామ్ చరణ్ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారు.

పుట్టబోయే పిల్లల కోసం సినిమాలకు బ్రేక్..

ఈ తరుణంలోనే తదుపరి ప్రాజెక్టులు కూడా కాస్త ఆలస్యం అవుతాయని స్పష్టమవతుంది. అయితే చరణ్ బ్రేక్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తన భార్య ఉపాసన(Upasana) ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె వచ్చే ఏడాదిలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఉపాసన డెలివరీ టైమ్ లో రామ్ చరణ్ పూర్తిగా తన సమయాన్ని తన భార్య పుట్టబోయే పిల్లలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట అందుకే సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా క్లిన్ కారా జన్మించిన సమయంలో కూడా చరణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి సమయాన్ని తన భార్య బిడ్డతో గడిపిన సంగతి తెలిసిందే.


కవలలకు జన్మనివ్వబోతున్న ఉపాసన..

ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొంత గ్యాప్ తర్వాతనే సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ తిరిగి బిజీ కానున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రంగస్థలం సీక్వెల్ గా రాబోతోందని వార్తలు కూడా బయటకు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలబడలేదు. ఇక సందీప్ రెడ్డితో సినిమా చేయబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, ఈ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం అవుతుంది.

Also Read: Rashmika -Vijay : ఎంగేజ్మెంట్ తర్వాత ఒకే స్టేజ్‌పైకి విజయ్ – రష్మిక… గుడ్ న్యూస్ లోడింగా ?

Related News

Rashmika Mandanna: మనసులో కోరిక బయట పెట్టిన రష్మిక.. సాధిస్తుందా?

Jackie Chan: జాకీ చాన్ మరణం పై వార్తలు.. బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా!

Prabhas @23 Years : అది బాడీ కాదురా… బాక్సాఫీస్.. 23 ఏళ్లల్లో ఎన్ని వేల కోట్లు అంటే ?

Rashmika -Vijay: ఎంగేజ్మెంట్ తర్వాత ఒకే స్టేజ్‌పైకి విజయ్ – రష్మిక… గుడ్ న్యూస్ లోడింగా ?

Hero Dharmendra: యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ప్రేక్షకులు అందించిన బిరుదులేంటో తెలుసా?

Tamannaah Bhatia: స్లిమ్ గా కనిపించడం కోసం ఇంజక్షన్స్.. తమన్నా గ్లామర్ సీక్రెట్ ఇదేనా?

Hero Dharmendra: చనిపోకముందే చంపేశారు.. ధర్మేంద్రకు ఇది మొదటిసారి కాదు

Big Stories

×