Azharuddin: తెలంగాణ కేబినెట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కు చోటు దక్కింది. ఎల్లుండి అక్టోబర్ 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ లో ఇంతవరకు మైనార్టీ మంత్రిగా ఎవరూ లేని విషయం తెలిసిందే. మైనార్టీ, హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
మంత్రి వర్గంలో ఇప్పటి వరకు ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపిన విషయం తెలసిందే. దానికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే అజారుద్దీన్ కు హోం లేదా మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హోం శాఖ సీఎం రేవంత్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ: Cyclone Montha: ఆ జిల్లాలపై మొంథా తుఫాను ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు