BigTV English

Kannappa Movie : కన్నప్పలో ప్రభాస్ ఫైట్.. అవసరం లేకున్నా అలా ఇరికించారా ?

Kannappa Movie : కన్నప్పలో ప్రభాస్ ఫైట్.. అవసరం లేకున్నా అలా ఇరికించారా ?

Kannappa Movie : కన్నప్ప.. మంచు ఫ్యామిలీ అన్ని ఎఫర్ట్స్ పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దాదాపు 200 కోట్లు పెట్టారు ఈ సినిమాపై. మంచు వారి నుంచి మూవీ అంటే ఎప్పటిలానే సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి. అయినా.. సినిమాపై కాస్తో కూస్తో బజ్ ఉంది అంటే కారణం… అక్షయ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు ప్రభాస్.


ఎంతో కొంత కంటెంట్ ఉంది కాబట్టే ఈ స్టార్స్ నటిస్తున్నారు అనే మౌత్ టాక్ ఇప్పుడు నడుస్తుంది. ఆ.. మౌత్ టాక్ వల్లే ఓపెనింగ్స్ రావొచ్చు. ఫస్ట్ షో పాజిటివ్ టాక్ వస్తే ఒకే. ఒక వేళ మంచు వారి సినిమాల్లానే ఇది కూడా ఉంటే విష్ణుకు భారీ దెబ్బ పడినట్టే అవుతుందని చెప్పొచ్చు.

అందుకే మూవీ యూనిట్ కాస్త జాగ్రత్తగానే ఉన్నట్టు తెలుస్తుంది. అన్నిటి కంటే ముఖ్యంగా ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాత్రను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్‌లో కూడా ప్రభాస్ సీన్స్‌నే ఎక్కువగా చూపించారు. అలాగే, ఈ మధ్యే మేకింగ్ వీడియో అంటూ ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ప్రభాస్ ఉన్న పార్ట్‌నే హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు.


ఇలా, ప్రభాస్‌ను తమ సినిమాకు మెయిన్ రోల్ అనేలా.. చూపించి, ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా వైడ్ ఆయనకు ఉన్న క్రేజ్‌ను క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు ఈజీగా అర్థమైపోతుంది.

కథకు అవసరం లేకుండానే ఆ ఫైట్ ?

ప్రభాస్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు అని మంచు విష్ణు చాలా సందర్భాల్లో చెప్పాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌ను విష్ణు గట్టిగానే వాడిసినట్టు తెలుస్తుంది.

ప్రభాస్ ఎంట్రీ ఇంటర్వెల్ తర్వాత ఉంటుందట. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు ప్రభాస్ పాత్ర ఉంటుందట. నిజానికి కథ ప్రకారం… ప్రభాస్ పాత్రకు అంత స్క్రీన్ స్పేస్ లేదట. ఓ సందర్భంలో తిన్నడుని మార్చడానికి ప్రభాస్ పాత్ర రావాలంట. 5 నుంచి 10 నిమిషాల పాటే ఆ పాత్ర ఉంటుందట.

కానీ, పాన్ ఇండియా ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ చేస్తున్న రుద్ర పాత్ర టైంను 30 నిమిషాల వరకు పెంచారట. అంతే కాదు… విష్ణు పాత్రకు ప్రభాస్ పాత్రకు మధ్య ఓ ఫైట్ సీన్ కూడా పెట్టారు.

నిజానికి ఈ ఫైట్ ఫస్ట్ అనుకున్న కథలో అసలు లేదట. కేవలం సినిమాపై హైప్ పెంచడానికి మాత్రమే ఇది అడిషనల్‌గా పెట్టినట్టు తెలుస్తుంది. తాను ప్రభాస్ ఫైట్ చేస్తామని పలు ఇంటర్వ్యూల్లో కూడా విష్ణు చెప్పుకున్నాడు. అలాగే, ట్రైలర్‌లో కూడా ఆ ఫైట్ తాలుకూ సీన్స్ కూడా మనం చూడొచ్చు.

ఇలా ప్రభాస్ ను కావాల్సినంత వాడుకుని సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశారని చెప్పొచ్చు.

Related News

Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Coolie Movie : రిలీజ్ కు ముందే ‘కూలీ ‘ హిట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే..?

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Chinmayi Sripada : రిపోర్టర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్మయి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

Nagarjuna:టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. నాగ్‌ను ఇరకాటంలో పెట్టిన జగపతిబాబు

NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

×