BigTV English

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Devara Movie: ఎన్టీఆర్(NTR) హీరోగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దేవర(Devara). రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన RRR సినిమా తర్వాత ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ 2024 సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల ఈ నేటికీ సరిగ్గా ఏడాది పూర్తి అయింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.


దేవర స్పెషల్ షో…

దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అయిన సందర్భంగా చిత్ర బృందం మరోసారి ఈ సినిమాను వెండితెరపైకి తీసుకువచ్చారు. అయితే సెప్టెంబర్ 27వ తేదీ సెకండ్ షో అర్జున్ 70mm థియేటర్లో ఈ సినిమా స్క్రీనింగ్ కానుంది. ఇలా ఈ ఒక్క షో మాత్రమే స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో మరోసారి దేవర సినిమాని వెండి తెరపై చూడటం కోసం ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇలా ఈ సినిమా తిరిగి వెండితెర పైకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం మిరాయ్ సెకండ్ షో క్యాన్సిల్ చేస్తూ దేవరని ప్రసారం చేయనున్నారు.

దేవర కోసం తప్పుకున్న మిరాయ్..


ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు మిరాయ్ చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ బ్లాక్ బస్టర్ సినిమాని గతంలో థియేటర్లో చూడటం మిస్ అయ్యారో అలాంటి వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి. అయితే ఈరోజు సెకండ్ షో మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో అభిమానులందరూ కూడా థియేటర్ కు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం దేవర సీక్వెల్ గురించి కూడా గతంలో ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ ఆగిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి.

దేవర 2 ఉన్నట్టే..

తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో దేవర 2 కూడా ఉంటుంది అంటూ చిత్ర బృందం వెల్లడించారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే… ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఈయన దేవర సీక్వెల్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ మరొక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కుమారస్వామి కథ నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వెల్లడించారు.

Also Read: Mohan Babu Look: ట్రోల్స్ ఎఫెక్ట్… మరో పోస్టర్ వచ్చేసింది… మరి దీంట్లో ఏం పెట్టారో ?

Related News

K – Ramp : బూతులు గురించి క్లారిటీ, లేడీ రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీనియర్ నరేష్

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Aryan Khan: ఏకంగా జక్కన్ననే ఒప్పించాడు, షారుక్ ఖాన్ కొడుకు మామూలోడు కాదు

Mohan Babu Look: ట్రోల్స్ ఎఫెక్ట్… మరో పోస్టర్ వచ్చేసింది… మరి దీంట్లో ఏం పెట్టారో ?

Parag Tyagi : తనని మర్చిపోలేక పోతున్నాను, పడుకునేటప్పుడు ఆమె బట్టలు పక్కలోనే..

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి భర్త  రాజ్ కుంద్రా… ఈసారి ఏంటంటే?

Big Stories

×