E-Paper
Advertisement

The Raja Saab రాజా సాబ్ లో వాడని ఫుటేజ్‌.. ప్రభాస్ అభిమానులకు మరో షాక్.. రూ.60 కోట్ల నష్టం..!

The Raja Saab  రాజా సాబ్ లో వాడని ఫుటేజ్‌.. ప్రభాస్ అభిమానులకు మరో షాక్.. రూ.60 కోట్ల నష్టం..!
Advertisement

The Raja Saab సంక్రాంతి పండుగకు విడుదలైన రాజా సాబ్ సినిమా ప్రభాస్ అభిమానులకు పెద్ద నిరాశను మిగిల్చింది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవడమే కాదు, సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో ట్రోలింగ్‌కు కూడా గురైంది. సినిమా థియేటర్ రన్ పూర్తయ్యి ఇప్పుడు ఓటీటీకి సిద్ధమవుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్థిక విషయాలు బయటకు వస్తున్నాయి.

అధికారికంగా నష్టాల వివరాలు ప్రకటించకపోయినా, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చింది. ముఖ్యంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది పెద్ద దెబ్బగా మారినట్టు టాక్. బాక్సాఫీస్ ఫెయిల్యూర్ ఒక సమస్య అయితే, అంతకంటే పెద్ద షాక్ ఏమిటంటే షూటింగ్ సమయంలో వృథా అయిన ఫుటేజ్.

Advertisement

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాకు నాలుగు గంటలకుపైగా సీన్లు షూట్ చేశారు. కానీ చివరికి థియేటర్లలో విడుదలైన వెర్షన్‌లో కేవలం మూడు గంటల మాత్రమే ఉపయోగించారు. అంటే దాదాపు ఒక గంట ఫుటేజ్ పూర్తిగా పక్కన పడిపోయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ వాడని సీన్ల వల్ల మాత్రమే సుమారు రూ.60 కోట్ల వరకు నష్టం జరిగిందని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు కారణమవుతోంది.

ఒక దశలో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన కూడా వచ్చిందట. కానీ దర్శకుడు మారుతి దీనికి ఒప్పుకోలేదని సమాచారం. ఇప్పటికే రాజా సాబ్ 2 కోసం అతని దగ్గర వేరే కథ సిద్ధంగా ఉందని, ఉన్న ఫుటేజ్‌ను చీల్చి రెండు భాగాలుగా చేస్తే ప్రభావం తగ్గిపోతుందని భావించాడట. అందుకే ఆ ప్లాన్‌ను పూర్తిగా వదిలేశారు.

Advertisement

కొంతమంది అభిప్రాయం ప్రకారం, వాడని సీన్లను ఓటీటీలో బోనస్ కంటెంట్‌గా లేదా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా విడుదల చేయొచ్చని. కానీ అది కూడా జరగలేదు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా హిట్ అయితే నష్టాలు కవర్ అవుతాయని ఆశించారు. కానీ అది విఫలమైంది.

బలహీనమైన కథ, అవసరానికి మించిన ఫుటేజ్, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల రాజా సాబ్ భారీ నష్టాలకు ఉదాహరణగా మారింది. పెద్ద హీరో ఉన్నా కంటెంట్ బలంగా లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి నిరూపించింది.

ALSO READ: Thanuja: నా బ్రతుకు నన్ను బ్రతుకనివ్వండి… ట్రోల్స్ పై ఎమోషనల్ అయిన బిగ్ బాస్ బ్యూటీ!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×