The Raja Saab producer: టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యా కాలంలో హీరోల కంటే నిర్మాతలే బాగా పాపులర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలే మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అదే సమయంలో కొంత మంది చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నిర్మాత వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే తన సినిమా నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆయన గుర్తించారు. అయితే ఇది బాగా తెలిసిన వారు చేసిన పనిగా ఆయన పరిగణిస్తున్నారు. దీనిని మీడియా ముందుకు తీసుకురావడానికి కూడా ఆయన ప్రిపేర్ అయ్యారట కానీ తెలిసినవారు వద్దు అనడంతో అక్కడితో సరిపెట్టుకున్నారని టాక్. ప్రస్తుతం ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జెంటిల్ మెన్ గా పేరున్న టీజీ విశ్వ ప్రసాద్ ను మోసగించింది ఎవరు అన్న దానిపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దాదాపు రూ. 40 కోట్ల వరకూ ఈ కుంబకోణం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఫైర్ బ్రాండ్ కావడంతో ఏ సినిమా ఇంటర్వ్యూలో అయినా చెప్పేయవచ్చు. దీని గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే నిర్మాత మీడియా ముందుకు రావాల్సిందే.
Read also-Mahesh Babu: అప్పుడు మాస్టర్ మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..
టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు నిర్మించే బ్యానర్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పేరుంది. ఈ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒక ‘జెంటిల్‌మెన్’ అని, నిర్మాతగా తన పని తాను చేసుకుపోతారని అందరూ అంటుంటారు. కానీ, తాజాగా ‘ది రాజాసాబ్’ నిర్మాణ పనుల పర్యవేక్షణలో దాదాపు 40 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్లు ఆయన గుర్తించారని సమాచారం. ఈ మోసం బయటి వ్యక్తుల కంటే, సంస్థలో కీలక బాధ్యతల్లో ఉండి, ఆయనకు బాగా తెలిసిన వారే చేశారని తెలియడం ఇప్పుడు ఇండస్ట్రీని విస్మయానికి గురి చేస్తోంది. నమ్మిన వ్యక్తులే ఇంత భారీ మొత్తంలో వెన్నుపోటు పొడవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
Read also-Prakash Raj: ఆ కారణంతోనే ‘స్పిరిట్’ మూవీ నుంచి ప్రకాష్ రాజ్‌ను తప్పించిన సందీప్ రెడ్డి వంగా..
నిజానికి టీజీ విశ్వప్రసాద్ ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే రకం. తన సినిమాల విషయంలో ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడినా, తప్పు చేసినా మీడియా సాక్షిగా కౌంటర్లు ఇస్తుంటారు. ఈ కుంభకోణం విషయంలో కూడా ఆయన పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి అందరి పేర్లు బయటపెట్టాలని భావించారట. అయితే, ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు, తెలిసిన వారు.. ఈ గొడవ ఇక్కడితో ఆపేయడం మంచిది” అని సలహా ఇవ్వడంతో ఆయన ప్రస్తుతానికి మౌనం వహించినట్లు టాక్. ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ చేసిన ఆ ‘నమ్మకస్తుడు’ ఎవరు అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో మిస్టరీగా మారింది. రూ. 40 కోట్లు అంటే ఒక మీడియం రేంజ్ సినిమా బడ్జెట్. ఇంత పెద్ద దెబ్బ తగిలినా ఆయన సినిమా నిర్మాణాన్ని ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ రాబోయే ఏదైనా ఇంటర్వ్యూలో దీనిపై పరోక్షంగానైనా స్పందిస్తారా? లేదా పూర్తిగా గుట్టుగా ఉంచుతారా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా సెట్స్‌లో ఇలాంటి ఆర్థిక అక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలే నేరుగా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ రోజుల్లో, టీజీ విశ్వప్రసాద్ గనుక నోరు విప్పితే మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.