Dude Trailer:ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరోగా, దర్శకుడిగా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్నారు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). తాజాగా ఆయన నుంచి వస్తున్న చిత్రం డ్యూడ్ (Dude). టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు (Mamita Baiju) హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రం ద్వారా సుధా కొంగర దగ్గర ఎనిమిదేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కీర్తిస్వరన్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. టైలర్ మొదలవగానే హీరో నడుచుకుంటూ వస్తూ..” లైఫ్ లో నువ్వు ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తే.. లైఫ్ కూడా నిన్ను లెఫ్ట్ హ్యాండ్ తోనే డీల్ చేస్తుంది”. అంటూ ఒక ఎమోషనల్ డైలాగ్ తో ట్రైలర్ ను ప్రారంభించారు. కట్ చేస్తే మమితా బైజు.. అన్ని విషయాలలో ప్రదీప్ కి అండగా ఉంటూ ఆఖరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక అంత సిద్ధం అయిపోయింది.. కొన్ని క్షణాల్లో పెళ్లి అనుకునే సమయానికి మనకు ఈ ప్రేమ, పెళ్లి సెట్ అవ్వదు అంటూ మమిత షాక్ ఇస్తుంది. “ఏంట్రా నీ కథ పిల్లుంటే పెళ్లి అవ్వదు.. పెళ్లి అవ్వాలంటే పిల్ల ఉండదు.. ఏంటి అసలు” అనే డైలమాలో పడిపోతాడు హీరో. కట్ చేస్తే మమితా రివేంజ్ టైమ్.. మరొకవైపు హీరో లైఫ్ లోకి నేహా శెట్టి వస్తుంది. ఒకవైపు ఎమోషనల్, మరొకవైపు కామెడీ, ఇంకోవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది. మరి థియేటర్లలోకి రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్లో డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. “తాళికి ఎలాంటి మర్యాద లేదు.. దాని వెనకాల ఉండే అమ్మాయి ఫీలింగ్స్ కే మర్యాద” అంటూ ప్రదీప్ చెప్పే డైలాగు అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు “జరిగేది ఏది మన చేతిలో ఉండదంటూ” హీరో చెప్పిన డైలాగ్ కూడా కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులలో సరికొత్త అంచనాలను పెంచేసింది అని చెప్పవచ్చు.
ఒకవైపు హీరోగా మరొకవైపు దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ప్రదీప్ నుంచి రాబోతున్న మరో చిత్రం ఎల్ఐసి.. (లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ). కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కూడా అక్టోబర్ 17వ తేదీన విడుదల కాబోతోంది. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో చూడాలి.
ALSO READ:Siva Raj Kumar : తొక్కిసలాటపై శివన్న రియాక్షన్… విజయ్ ఆలోచించాల్సింది అంటూ