Gold Vs Real Estate Vs Stocks: ప్రస్తుతం చాలా మంది భవిష్యత్తు కోసం ఎంతో కొంత పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు, లైఫ్ స్టైల్ మార్పులు, ఆరోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణం అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చాలా మంది ప్రస్తుతం బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. వీటిలో పెట్టుబడులు అధిక లాభాలను అందిస్తాయి. అంతే కాకుండా ప్రతీది దాని స్వంత ప్రయోజనాలు, నష్టాలను కూడా కలిగి ఉంటాయి. ఇంతకీ భవిష్యత్తు కోసం వేటిపై పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం vs. రియల్ ఎస్టేట్ vs. స్టాక్స్.. సరైన పెట్టుబడి వేటిలో పెట్టాలో ఎంచుకోవడం ఒక పెద్ద సవాలు అనే చెప్పొచ్చు. డబ్బును ఖర్చు పెట్టకుండా ఉండటం, దానిని రెట్టింపు చేయడం వంటి వాటి గురించి ఆలోచించినప్పడు బంగారం , రియల్ ఎస్టేట్ , స్టాక్స్ వంటివి మొదట గుర్తుకు వస్తాయి.
బంగారం: ఒక సాంప్రదాయ, సురక్షితమైన పెట్టుబడి:
మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా. అందుకే రోజు రోజుకూ బంగారం ధర పెరుగుతోంది. బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే దాని విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు. బంగారం పెట్టుబడి పెడితే.. లాభం తప్ప దాదాపు నష్టం ఉండదు. అంతే కాకుండా దీనిని కొనడం, అమ్మడం చాలా సులభం. గోల్డ్ ఇటిఎఫ్‌లు, డిజిటల్ బంగారం వంటివి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దీనిని భద్రంగా ఉంచడం కోసం మాత్రం బ్యాంకులను ఆశ్రయించాల్సి ఉంటుంది.
రియల్ ఎస్టేట్: స్థిరమైన, దీర్ఘకాలిక ఆస్తులు:
రియల్ ఎస్టేట్ పెట్టుబడి చాలా కాలంగా బలమైన ఆస్తులలో ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే ఆస్తి విలువలు కాలక్రమేణా పెరుగుతూనే ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశాలు పెరుగుతాయి. భూములు రేట్లు కూడా దాదాపు పెరుగుతూనే ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం. ఇంకా.. కొనడానికి, అమ్మడానికి కూడా సమయం పడుతుంది. అందుకే బంగారం కొనడానికి ఆసక్తి చూపినంతగా చాలా మంది రియల్ ఎస్టేట్ పై చూపించరు. మీ దగ్గర ఎక్కువగా పెట్టుబడి కోసం డబ్బులు ఉండి.. చాలా ఏళ్ల వరకు పెట్టుబడిపై అవసరం లేకుంటే నిస్సందేహంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందవచ్చు.
Also Read: మానసిక ప్రశాతంత కరువైందా ? ఇలా చేస్తే అంతా సెట్ ..
స్టాక్స్: అధిక రిస్క్, అధిక రాబడి:
స్టాక్ మార్కెట్ లో తక్షణ లాభాలు పొందవచ్చు. పెరుగుతున్న పెట్టుబడిదారుల సంఖ్య, ముఖ్యంగా యువత, దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది అత్యధిక దీర్ఘకాలిక రాబడిని అందించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఒక ప్రయోజనం ఏమిటంటే.. దీనిలో చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టవచ్చు. డివిడెండ్లు, బోనస్ షేర్లు వంటి అదనపు ప్రయోజనాలు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మార్కెట్ చాలా అస్థిరమైనది. జ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడం నష్టాలకు దారితీస్తుంది. స్టాక్ పై పెట్టుబడి పెట్టడం, లాభాలపై అవగాహన ఉంటే వీటి ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు.