Ananya Nagalla: అనన్య నాగళ్ల (Ananya Nagalla).. తెలుగు హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో, గ్లామర్ తో, నటనతో ఎప్పటికప్పుడు యువతను కట్టిపడేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అవకాశాలను కూడా గట్టిగానే ఒడిసి పడుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు అనన్య ప్రేమలో పడిపోయింది అంటూ సరదాగా అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అనన్య నాగళ్ల ప్రేమలో పడిన వ్యక్తి ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది. అందులో భాగంగానే తాను ప్రేమలో పడ్డ విషయాన్ని చెప్పుకొచ్చింది. మరి వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే.. తాజాగా ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ దోస తింటున్న వీడియోని అభిమానులతో పంచుకుంది. అందులో ఒక వ్యక్తి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి.. ? పని ప్రశ్నించగా.. దోస అంటూ తెలిపింది. ఇక దోసతోపాటు.. బిర్యానీ , ఇడ్లీ, పరోట అంటూ పలు రకాల పేర్లు అడిగినా ఆమె మాత్రం తనకు దోస అంటే చాలా ఇష్టమని, దోస తో తనకున్న అనుబంధం చాలా గట్టిదని, దోసతో తాను ప్రేమలో పడిపోయాను అంటూ అనన్య షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాదు అనన్య ఈ వీడియో షేర్ చేస్తూ మీలో ఎవరైనా ఇలా దోష లవర్స్ ఉన్నారా? అంటూ క్యాప్షన్ కూడా జోడించండి. మొత్తానికైతే దోసతో ప్రేమలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ.
అనన్య నాగళ్ల కెరియర్ విషయానికి వస్తే.. మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ , పొట్టేలు వంటి చిత్రాలతో తనను తాను స్టార్ నటిగా చిత్రీకరించుకుంది. ముఖ్యంగా ఈమె నటనకు గద్దర్ తెలంగాణ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. పొట్టేలు సినిమాకు గాను లభించిన ఈ అవార్డుతో ఈమెకు మరిన్ని అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించిన ఈమె తొలిసారి ఉత్తమ నటి విభాగంలో ఇలా స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక తెలుగు కుటుంబంలో.. వెంకటేశ్వరరావు – విష్ణు ప్రియ దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి వ్యాపారవేత్త. ఈమె కుటుంబం ఈమె చదువు కోసం హైదరాబాద్ కి వచ్చింది. ఇబ్రహీంపట్నంలోని రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన ఈమె.. చిత్ర పరిశ్రమలో కెరియర్ ను కొనసాగించక ముందు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కూడా చేసింది. అలా ఉద్యోగం చేస్తున్నప్పుడే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.
ALSO READ: Trivikram – Venky : తమన్‌కు గురూజీ టాటా బై బై.. ఇక యాంగ్రీ యానిమల్‌ను చూస్తారు
?utm_source=ig_web_copy_link