Trivikram – Venky : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అది హీరో – హీరోయిన్ , దర్శకనిర్మాతలు, హీరో – దర్శకుడు, లేదా దర్శకుడు- మ్యూజిక్ డైరెక్టర్ .. ఇలా కొన్ని కాంబినేషన్లో వరుస చిత్రాలకు పని చేస్తూ.. మంచి సెన్సేషన్ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి.. అయితే కొన్ని కొన్ని కారణాలవల్ల అనుకోకుండా ఆ కాంబినేషన్స్ మధ్య డిస్టర్బ్ ఏర్పడితే మాత్రం. ఒకరికొకరు దూరం అవుతారు అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే జరుగుతోంది అనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. గురూజీగా పేరు సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ప్రస్తుతం ఈయన వెంకటేష్ (Venkatesh).తో ఒక సినిమా చేస్తున్నారు.’అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి కూడా ఎప్పటిలాగే తమన్ (S. Thaman) మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ గత మూడు చిత్రాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. దీంతో ఈసారి కూడా ఆయనే వ్యవహరిస్తారు అంటూ వార్తలు రాగా.. సడన్గా ‘యానిమల్’ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameswar) ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారట.
ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ గత మూడు చిత్రాలకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ‘గుంటూరు కారం’ సినిమా సమయంలో చాలా కాంట్రవర్సీ అయింది. మ్యూజిక్ ఏది కూడా మహేష్ బాబుకు నచ్చలేదని.. దాంతో త్రివిక్రమ్ రంగంలోకి దిగి తమన్ తో పని చేయించాడు అని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇంత సన్నిహితంగా ఉన్న తమన్ ను త్రివిక్రమ్ పక్కనపెట్టి.. యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ ను రంగంలోకి దింపడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే యానిమల్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు హర్షవర్ధన్. దాదాపు 20 కి పైగా సీన్ల దగ్గర ఆయన బ్యాక్ గ్రౌండ్ సన్నివేశాలు అదిరిపోయాయి. అందుకే ఈసారి హర్షవర్ధన్ ని రంగంలోకి దింపారట. మరి వీరి కాంబినేషన్లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇకపోతే హర్షవర్ధన్ రామేశ్వర్ కి ‘#పూరీసేతుపతి’ మూవీలో కూడా అవకాశం లభించింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా, పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్లో వస్తున్న పూరీసేతుపతి సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశాన్ని అందుకున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ మేరకు చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మొత్తానికైతే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో మ్యూజిక్ యంగ్ సెన్సేషన్ గా పేరు సొంతం చేసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ కి ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతుండడంతో ఆయనపై అంచనాలు పెరిగిపోయాయి.
ALSO READ: Bigg Boss: బిగ్ బాస్ కోసం ఉపముఖ్యమంత్రి.. తెరుచుకున్న గేట్లు!