Narne Nithin Wedding: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది హీరోలు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి శుభవార్తలను అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతమంది హీరోలు తండ్రిగా ప్రమోట్ కాగా, మరి కొంతమంది నిశ్చితార్టానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక మరొక టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ (NTR)బావమరిదిగా యంగ్ హీరో నార్నే నితిన్(Narne Nithin) అందరికీ ఎంతో సుపరిచితమే.
నితిన్ హీరోగా మ్యాడ్, మ్యాడ్ 2, అయ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నితిన్ మరికొన్ని గంటలలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నితిన్ నెల్లూరుకు చెందిన శివాని(Shivani) అనే అమ్మాయితో గత ఏడాది నవంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా నుంచి తర్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా గత ఏడాది నిశ్చితార్థం జరగగా, ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్టోబర్ 10వ తేదీ రాత్రి11:53 నిమిషాలకు హైదరాబాద్ లోని నియో కన్వెన్షన్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ క్రమంలోని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
తాజాగా నితిన్ సంగీత్, మెహందీ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో భాగంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi)స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్పెషల్ డిజైనర్ మోడరన్ డ్రెస్ లో లక్ష్మీ ప్రణతి సూపర్ క్యూట్ లుక్ లో కనిపించడంతో ఈ ఫోటోలు కాస్త మరింత వైరల్ అవుతున్నాయి.
సంగీత్ వేడుకకు దూరంగా తారక్?
ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె కూడా హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు ఏవి బయటకు రాకపోవడంతో వదినమ్మతో పాటు అన్నయ్య కూడా ఉండి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సంగీత్ కు దూరంగా ఉన్న పెళ్ళికి హాజరవుతారని తెలుస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భాగంగా ఈయన ఇప్పటికీ కాస్త ఇబ్బంది పడుతున్నారని స్పష్టమవుతుంది. నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్వయంగా హీరో వెంకటేష్ కు సమీప బంధువులనే సంగతి తెలిసిందే. శివాని కుటుంబం కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ కుటుంబానికి కాస్త రాజకీయ నేపథ్యం కూడా ఉందని తెలుస్తోంది.నార్నే నితిన్ తండ్రి శ్రీనివాస్ కూడా వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే.