BigTV English

Krithi Shetty: ఒక్క నెలలోనే 3 సినిమాలు ఓకే.. హిట్ దక్కేనా బేబమ్మ

Krithi Shetty: ఒక్క నెలలోనే 3 సినిమాలు ఓకే.. హిట్ దక్కేనా బేబమ్మ

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందం కృతి శెట్టి. టాలీవుడ్ లో ఆమెకు దక్కిన గ్రాండ్ ఎంట్రీ ఇంకే హీరోయిన్ కి దక్కలేదు అని అంటే అతిశయోక్తి లేదు. ఉప్పెన సినిమా రిలీజ్ కు ముందే కృతి శెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మొదటి సినిమాతోనే 100కోట్ల హిట్ ను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది కృతి.


ఉప్పెన సినిమా తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కృతిని చూసి టాలీవుడ్ మొత్తం నెక్స్ట్ టాప్ హీరోయిన్ ఈమెనే అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అందుకు తగ్గట్టుగానే కృతి కూడా వరుస సినిమాలతో టాలీవుడ్ ని ఏలేద్దామని ప్రయత్నాలు సాగించింది. కానీ అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్లు మొదటి సినిమా తప్ప ఇప్పటివరకు కృతి రెండో హిట్ ను అందుకోలేదు. స్టార్ హీరోలు సినిమాల్లో చేసింది అని చెప్పడమే కానీ ఆమె దురదృష్టం ఒక్క సినిమా కూడా హిట్ అయింది లేదు. అయినా కూడా కృతి ఏ మాత్రం అధైర్య పడకుండా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటిస్తూనే ఉంది.

అయితే తెలుగు లేకపోతే తమిళ్ అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఒక మంచి విజయం కోసం కష్టపడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక్క నెలలో ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అవన్నీ తమిళ సినిమాలు కావడం విశేషం. అయితే ఈ మూడు సినిమాలతో కృతి ఒక్క హిట్ అయిన అందుకుంటుందేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ఇక ఈ మూడు సినిమాల గురించి మాట్లాడుకుంటే అవన్నీ స్టార్ హీరోల సినిమాలే. మొదటిది కార్తీ హీరోగా నటించిన వా వాతియర్. నాలన్  కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ఇక ఇది కాకుండా కృతి హీరోయిన్ గా నటిస్తున్న మరో చిత్రం Lik. ప్రదీప్ రంగనాథన్ హీరోగా హీరోయిన్ నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అని కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమవుతుంది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రానుందనీ మేకర్స్ ప్రకటించారు. కానీ, అదే రోజు ప్రదీప్ మరో సినిమా డ్యూడ్  కూడా రిలీజ్ కానుండడంతో ఆ సినిమా వాయిదా పడి డిసెంబర్ 18న రిలీజ్ కానున్నట్లు మేకర్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్ సినిమాలు అంటే కచ్చితంగా హిట్ అవుతాయి అనే పాజిటివ్ టాక్ బయట ఉంది దీంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు కృతి నటించిన మరో చిత్రం జీనీ. రవి మోహన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు అర్జునన్  దర్శకత్వం వహిస్తున్నాడు. కృతితో పాటు కళ్యాణి ప్రియదర్శన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కూడా డిసెంబర్లోనే రానుంది. ఇలా నెల రోజుల్లోనే కృతి నటించిన మూడు సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. దీంతో ఈ మూడు సినిమాలపైనే అమ్మడి కెరిర్ ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. మరి మూడు సినిమాలు నెలలో రిలీజ్ అవ్వడమేనా.. బేబమ్మ హిట్ అందుకొనేది  ఉందా అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

Related News

Trivikram Venkatesh movie : చిక్కుల్లో గురూజీ, అలా చేస్తే కానీ బయటపడలేరు

Mohan lal: మోహన్ లాల్ వృషభ రిలీజ్ డేట్ లాక్.. ఓకే ఏడాదిలో 5 సినిమాలు రిలీజ్..చూసి నేర్చుకోండయ్యా!

Sandeep Reddy Vanga Kurtas : సందీప్ రెడ్డి వంగ ఎక్కువగా కుర్తాల్లో కనిపించటానికి కారణం ఇదే

Nuvvu Naku Nachav: మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న నువ్వు నాకు నచ్చావ్.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

Bison First Single: “తీరేనా మూగవేదన”.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్!

Saife Ali Khan: ఆ రోజు నా కొడుకుపై కూడా కత్తితో దాడి చేశాడు, ఆ తర్వాత.. సైఫ్‌ షాకింగ్‌ కామెంట్స్

Actress Trisha: వ్యాపారవేత్తతో పెళ్లి… తెరపైకి మళ్లీ త్రిష పెళ్లి వార్తలు?

Ajay Bhupathi: బాలీవుడ్ ను టార్గెట్ చేసిన అజయ్ భూపతి.. ఫ్రాంచైజీస్ గా హిట్ సినిమా!

Big Stories

×