Jio Safety Phone| రిలయన్స్ జియో తాజాగా జియోభారత్ సేఫ్టీ-ఫస్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో ఈ ఫోన్లను ప్రవేశ పెట్టింది జియో. భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను లక్ష్యంగా ఈ ఫోన్లు తయారు చేయబడ్డాయి. తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎక్కడ ఉన్నా వారితో కనెక్ట్ అయి ఉండాలని వారు సురక్షితంగా ఉన్నారని వినియోగదారులు నిర్ధారించుకునే విధంగా ఈ ఫోన్లో ఫీచర్లు ఉన్నాయి.
జియోభారత్ సేఫ్టీ-ఫస్ట్ ఫోన్ చాలా సరసమైన ధరలో లభిస్తుంది. దీని ధర కేవలం ₹799 మాత్రమే. వివిధ రిటెయిల్ ఛానెల్‌ల ద్వారా లభిస్తుంది. ఈ సరసమైన ఫోన్ అన్ని జియో స్టోర్లలో దొరుకుతుంది. అంతేకాదు అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కూడా లభిస్తుంది.
ఫోన్లో రియల్-టైం లొకేషన్ మానిటరింగ్ చేయవచ్చు. వినియోగదారులు తమ ప్రియమైనవారిని చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇంట్లో ఉంటూనే తల్లిదండ్రులు తమ ఫోన్ల నుండి పిల్లలున్న స్థానాన్ని చూడవచ్చు. ఈ లొకేషన్ మానిటర్ కుటుంబ సభ్యులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, వయోవృద్ధుల కోసం అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్ లో ముందస్తుగా ఎవరి కాల్స్ స్వీకరించాలో నిర్ణియంచుకోవచ్చు. దీనికోసం బిల్ట్ ఇన్ యూసేజ్ మేనేజర్ ఉంది. సైబర్ మోసగాళ్లు, స్పామ్ కాల్స్ ని ఇది బ్లాక్ చేస్తుంది.
అనసరంగా వచ్చే మార్కెటింగ్ కాల్స్ కూడా బ్లాక్ చేస్తుంది. సోషల్ మీడియాకు పిల్లలు దూరంగా ఉండాలని కోరుకునే వారికి ఇది అనువైన ఫోన్.
ఈ ఫోన్ లో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంది. దీని బ్యాటరీ లైఫ్ ఏడు రోజుల వరకు బ్యాకప్ వస్తుంది. పదేపదే ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. విద్యుత్ సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాలలో దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ ప్రస్తుత నెట్‌వర్క్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది, తద్వారా వినియోగదారుకు నిరంతర కనెక్టివిటీ ఉండేలా చేస్తుంది. దీంతో ఎల్లప్పుడు మీ కుటుంబంతో కనెక్ట్ అయి ఉంటారు.
జియోభారత్ సేఫ్టీ-ఫస్ట్ ఫోన్ భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ₹799 అనే సరసమైన ధరలో రియల్-టైం లొకేషన్ ట్రాకింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, స్పామ్ బ్లాకింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో స్పెషల్. మీ కుటుంబ భద్రతకు ప్రాధన్యం ఇచ్చే వారైతే ఈ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేయండి.