Gold Rate Increase: బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఎప్పుడు లేని విధంగా పైపైకి పోతున్నాయి. 24క్యారెట్ల బంగారంతో పాటు 22 క్యారెట్ల బంగారం కూడా లక్ష మార్క్ ను దాటేసింది. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 24వేలకు చేరుకోగా భవిష్యత్ లో లక్షా 50వేలకు చేరుకుంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
నేటి పసిడి ధరలు..
బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,930 కాగా.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,150 వద్ద పలుకుతోంది.. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,13,600 ఉండగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,800 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.200 పెరిగింది.. ఇలాగే పెరిగితే ఇంకా బంగారం ఎవ్వరు కొనరు..
పరుగాపని బంగారం ధరలు..
బంగారం ధరలు రోజురోజుకు పరుగులు ఆగకుండా పోతున్నాయి. ఒక్క రోజు వేయిలలో పెరిగిపోతుంది. దీంతో బంగారు ప్రియలు కన్నీరు పెడుతున్నారు. బంగారం ఇలా పెరిగితే ఇంకా బంగారం ఎలా కొనాలని.. బంగారం ధరలు ఇలా పెరగడంతో పెళ్లీల్లు, శుభకార్యాలు ఉన్నవారు బంగారం ఎలా కొనాలని వణికిపోతున్నారు. ఇప్పుడు ఆస్తులు పెట్టడం కన్నా బంగారం ఉంటే చాలు అన్నట్లుగా మారిపోయింది వ్యవహారం.. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలేలా లేదని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,150 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,800 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,800 వద్ద కొనసాగుతుంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,150 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,800 వద్ద పలుకుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,300 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,13,950 వద్ద ఉంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్..
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరల మార్గంలోనే సిల్వర్ కూడా నడుస్తోంది. వాటికి ఏమాత్రం తగ్గకుండా సమానంగా సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,70,000 కాగా గురువారం కేజీ సిల్వర్ ధర రూ.1,71,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 1,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,61,000 వద్ద కొనసాగుతోంది.