Pradeep Ranganathan:కొంతమంది హీరోలకు కటౌట్, అందం లేకున్నా కూడా తమ యాక్టింగ్ తోనే ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో రజినీకాంత్(Rajinikanth), ధనుష్ వంటి హీరోలు ఉంటారు. వీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు అనుభవించారు. అందం, కటౌట్ లేకపోయినా తమ యాక్టింగ్ తోనే అందర్నీ అలరించారు. అయితే అలాంటి హీరోల జాబితాలోకి ప్రస్తుతం మరో హీరో కూడా చేరిపోయారు. ఆయనే తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. ఈయన అచ్చం ధనుష్ (Dhanush) కటౌట్ ని పోలి ఉండడంతో పాటు యాక్టింగ్ కూడా ఆయన లాగే చేస్తారు.. అయితే అలాంటి ప్రదీప్ రంగనాథన్ కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. అలా మల్టీ టాలెంటెడ్ గా ఉన్నటువంటి ప్రదీప్ రంగనాథన్ తమిళంలోనే కాదు టాలీవుడ్ లో కూడా లవ్ టుడే(Love Today) మూవీతో పాపులర్ అయ్యారు.ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఈయన నటించిన పలు సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. అయితే అలాంటి ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు హీరో నాని (Hero Nani) రికార్డును సమం చేయబోతున్నారు.
విషయంలోకి వెళ్తే.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Love Insurance Kompany), డ్యూడ్(Dude) ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం అంటే ఆ హీరో అభిమానులు ఒక డైలమాలో పడిపోతారు. ఎందుకంటే ఆ సినిమా చూడాలా? ఈ సినిమా చూడాలా? అనేది వారికి అర్థం కాదు. అలా అభిమానులను డైలమాలో పడేసి ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్యూడ్ రెండు సినిమాలను కూడా ఈ నెల అనగా అక్టోబర్ 17న విడుదల చేయడం కోసం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.. అలా రెండు సినిమాలు దీపావళి బరిలో అక్టోబర్ 17న విడుదల కాబోతున్నాయి..
also read:Naga Chaitanya: ప్రయత్నించినా.. తప్పించుకోలేకపోయా.. చైతూ మాటలు వెనుక ఆంతర్యం?
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ విషయానికి వస్తే.. నయనతార (Nayanthara) భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది.అటు డ్యూడ్ సినిమాని తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ సినిమా అక్టోబర్ 17న విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్ గా నటిస్తోంది. అలా ఈ హీరో నటించే రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో అభిమానులు ఏ సినిమా చూడాలో తెలుసుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో నాచురల్ స్టార్ నాని (Nani) నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం(Evade Subramanyam), జెండాపై కపిరాజు(Jenda pai Kapiraju).. సినిమాలు కూడా ఒకేరోజు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల్లో జెండాపై కపిరాజు సినిమా ఫ్లాప్ అయితే.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా హిట్ అయింది. అలా నాని రికార్డును ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ సమం చేయబోతున్నాడు.. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా హిట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. వరుస సినిమా హిట్స్ తో జోరు మీదున్న ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గానే డ్రాగన్(Dragon)మూవీతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్యూడ్ సినిమాలతో మళ్లీ మనల్ని పలకరించబోతున్నారు. అలా యూత్ మెచ్చే కథలను ఎంచుకుంటూ యంగ్ హీరోగా సౌత్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.