BigTV English

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Saiyami Kher : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ ని వారు వినియోగించుకొని ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులు కేవలం తెరమందు నటించడమే కాదు వారిలో మనకు తెలియని మరెన్నో టాలెంట్లు కూడా ఉంటాయి. అలా చాలామంది సెలబ్రిటీలు సినిమాల్లో చేస్తూనే అప్పుడప్పుడు తమ టాలెంట్ ని కూడా బయటపెడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆమే సయామీ కేర్(Saiyami Kher).. ఈ హీరోయిన్ నటిగానే కాదు అథ్లెట్ గా కూడా తన టాలెంట్ ని బయట పెట్టుకుంది. ఈ హీరోయిన్ సాధించిన ఘనతలకు గాను తాజాగా ఆమెకు అరుదైన గౌరవం లభించింది. మరి ఆమెకు అందిన ఆ అరుదైన గౌరవం ఏంటో ఇప్పుడు చూద్దాం..


అరుదైన రికార్డ్ సృష్టించిన సయామీ ఖేర్..

బాలీవుడ్ నటి సయామీ కేర్ ను తాజాగా ఐరన్ మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ.. ఫేస్ ఆఫ్ ఐరన్ మ్యాన్ ఇండియా(Face of Iron Men India)గా సెలెక్ట్ చేశారు.ఈ హీరోయిన్ సంవత్సర కాలంలో ఏకంగా రెండుసార్లు ఐరన్ మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ లను పూర్తి చేసినందుకు గానూ .. ఐరన్ మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఈ అరుదైన గౌరవాన్ని అందించింది. అలా తన జీవితంలో హీరోయిన్ గానే కాకుండా అథ్లెట్ గా కూడా సయామీ ఖేర్ ఓ మైలురాయిని సాధించింది. అంతేకాదు ఇలాంటి విజయం అందుకున్న ఏకైక భారతీయ నటిగా సయామీ ఖేర్ పేరు తెచ్చుకుంది.. 2024 సెప్టెంబర్ లో ఐరన్ మ్యాన్ 70.3 అలాగే 2025 జూలైలో రెండో సారి పూర్తి చేసింది.. 70.3 లో పాల్గొన్న వారి మొత్తం దూరాన్ని మైళ్ళలో సూచిస్తారు. అలా 1.9 కి.మీ ఈత, 21.1 కి.మీ పరుగు, 90 కి.మీ. సైక్లింగ్ ఇలా అన్ని ఒకేరోజు వరుసగా పూర్తి చేసింది.. ఈమె విజయానికి కారణం నిబద్ధత,స్ఫూర్తి,స్థిరత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఐరన్ మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ సయామీ ఖేర్ ని ఐరన్ మ్యాన్ ఇండియా ఎడిషన్ యొక్క ప్రతినిధిగా కూడా నియమించింది.

also read:Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!


సంతోషం వ్యక్తం చేసిన సయామీ ఖేర్..

సయామీ ఖేర్ తనకి అందిన ఈ గౌరవం గురించి మాట్లాడుతూ.. “నవంబర్ 9న గోవాలో జరిగే ఐరన్ మ్యాన్ ఇండియాకు ప్రతినిధిగా ఉండడం నిజంగా నాకు ఉత్సాహంగా ఉంది.ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో రెండు సార్లు ఐరన్ మ్యాన్ 70.3ని పూర్తి చేయడం అంత సులభం కాదు. ప్రతి ఎత్తు పైకి దూకడం, స్విమ్ స్ట్రోక్,రన్నింగ్ చేయడం ఇలా ప్రతి అడుగులో మన శరీరం, మనసు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాయో నాకు గుర్తు చేసింది.. ఐరన్ మ్యాన్ అనేది కేవలం ఒక జాతి కాదు ఒక మనస్తత్వం,జీవన విధానం ..సినిమాల్లో యాక్టింగ్ లో అయినా.. క్రీడల్లో అయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా సరిహద్దులను దాటడాన్నే ఇష్టపడతాను. నా ఈ ప్రయాణం ఎంతోమంది మహిళలను ప్రేరేపించగలదని నేను ఆశిస్తున్నాను. సంకల్పం,పట్టుదల ఉంటే ప్రతి ఒక్కదానిలో విజయం సాధించవచ్చు. ఇందులో భాగమైనందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞరాలినే” అంటూ స్పందించింది..

సయామీ ఖేర్ సినిమాలు..

అలా సయామీ ఖేర్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు క్రీడారంగంలో కూడా రాణిస్తోంది. ఈ హీరోయిన్ సినిమాల విషయానికి వస్తే.. రేయ్ (Rey)అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హిందీ,మరాఠీ సినిమాల్లో కూడా రాణించింది. ఇక తెలుగులో రేయ్ మూవీ తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్(Wild Dog), ఆనంద్ దేవరకొండ తో హైవే లో నటించింది. చివరిగా ఈ హీరోయిన్ బాలీవుడ్లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన జాట్ (Jaat)మూవీలో మెరిసింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్,అక్షయ్ కుమార్ కాంబోలో వస్తున్న హైవాన్(Haiwaan) మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Sai Pallavi: నయనతారకు ఎసరు పెడుతున్న సాయి పల్లవి… ఏం చేసిందంటే ?

Pradeep Ranganathan: హీరో నాని రికార్డును సమం చేయబోతున్న యంగ్ హీరో.. ఫలితం లభిస్తుందా?

Roshan Champion: ఫీల్డ్‌లో అడుగుపెట్టిన ఛాంపియన్‌.. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Big Stories

×