Upasana -Klin Kaara: మెగా కోడలు ఉపాసన(Upasana) తన వృత్తిపరమైన అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు. ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా కూడా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.. ఇలా నిత్యం తన వృత్తిపరమైన వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా ఉపాసన బిజీగా గడుపుతూ ఉంటారు. ఇదే సమయంలోనే తన ఫ్యామిలీకి ఎంత సమయం కేటాయించాలో అంతే సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతూ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల దసరా, బతుకమ్మ వేడుకలను ఢిల్లీలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలలో భాగంగా ఉపాసన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇక ఉపాసన రాంచరణ్(Ramcharan) దంపతులకు వివాహం జరిగిన 12 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారారు. ఉపాసన గత మూడు సంవత్సరాల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా చిన్నారికి క్లిన్ కారా కొణిదెల(Klin kaara Konidela) అని నామకరణం చేశారు. అయితే పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఇంతవరకు తను ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం ఎక్కడ రివిల్ చేయలేదు. ఎందుకు తన కుమార్తెను ఎవరికి చూపించకుండా జాగ్రత్త పడుతున్నారనే విషయాలను తాజాగా ఉపాసన తెలియజేశారు.
ఈ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఇటీవల కాలంలో అమ్మాయిల పట్ల జరుగుతున్న కొన్ని సంఘటనలు తల్లితండ్రులను పెద్ద ఎత్తున భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే ఇలాంటి విషయాలలో తన బిడ్డకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అందుకే ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన లేదా ఎక్కడికి వెళ్ళినా తన కుమార్తె మొహానికి మాస్క్ వేస్తున్నామని ఇలా మాస్క్ వేసి తీసుకెళ్లడం ఒక తల్లిగా నాకు ఎంతో కష్టతరమైనప్పటికీ మా కూతురిని ఇలా సంరక్షించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ విషయంలో, నేను చరణ్ సంతోషంగానే ఉన్నామని తెలిపారు.
మళ్లీ తల్లి కాబోతున్న ఉపాసన?
ఇక ఉపాసనని సంబోధించేటప్పుడు గ్లోబల్ స్టార్ భార్య, స్టార్ హీరో కోడలు అంటూ కొన్ని ట్యాగ్ తో తనని సంబోధించడం పట్ల కూడా ఉపాసన స్పందించారు. అలా కొందరు నన్ను పిలుస్తున్నారు అంటే వాళ్లకు మనం నచ్చినట్లే అలాగే అలాంటి టాగ్స్ తీసుకోవడం వల్ల మనకు కూడా ఎంతో బాధ్యత కూడా ఉంటుందని ఈ విషయంలో తనని ఎలా పిలిచినా సంతోషమే అంటూ తెలియచేశారు. ఇకపోతే ఇటీవల ఉపాసనకు సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఉపాసనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు రావడంతో ఈ వీడియోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపించారు. ఈ క్రమంలోనే ఈమె మరోసారి తల్లి కాబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఇప్పటివరకు ఈ వార్తలు పై మెగా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Also Read: Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట