Sai Pallavi Vs Nayanthara: లేడీ సూపర్ స్టార్ అనగా వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తొలి నటి నయనతార ఈమె. దశాబ్దాలుగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇప్పటి దక్షిణాది నయన్ను అధిగమించిన హీరోయిన్లు లేరంటే అతిశయోక్తి కాదు. సమంత, తమన్నా, పూజ హెగ్డే ఇలా ఎంతో మంది స్టార్స్ వెలుగులోకి వచ్చారు. కానీ, నయన్ను నటనలో నయన్ను అధిగమించిన వారు లేరు. ఇక పారితోషిక్ విషయంలో ఆమె దారిదాపుల్లో మరో దక్షిణాది బ్యూటీ లేదు.
అయితే చాలా కాలం తర్వాత పరిశ్రమలో నయన్ గట్టి పోటీ ఇచ్చే హీరోయిన్ వచ్చేసింది. ఆమె మరెవరో కాదు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి.. క్రేజ్ బాలీవుడ్ వరకు వెళ్లింది. మొన్నటి వరకు దక్షిణాది పరిశ్రమ వరకే పరిమితమైన ఆమె.. ఇప్పుడు హిందీలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తోంది. దీంతో సాయి పల్లవి మార్కెట్ విపరీతంగా పెరిగింది. రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లోనే తీసుకుంటుందట. కాగా ఇప్పటి వరకు సౌత్లో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్గా నయనతార ఉంది. ఒక్కొక్కొ సినిమాకు ఆమె రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది. గతంలో ఆమె నటించి బాలీవుడ్ చిత్రం జావాన్కు రూ. 12 కోట్లు తీసుకుందట.
దీంతో నెక్ట్స్ సినిమాలకు నయన్ రూ. 15 కోట్లు డిమాండ్ చేస్తుంది. ఈ స్థాయికి చేరుకునేందుకు నయన్కు దశాబ్దాల కాలం పట్టింది. కానీ, సాయి పల్లవి మాత్రమే ఒక్క డికెడ్లోనే నయనతార అధిగమించిందని ఇండస్ట్రీలో వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. నటనపరంగానే కాదు రెమ్యునరేషన్ విషయంలో సాయి పల్లవి నయనతారకు గట్టి పోటీ ఇస్తుందట. తనదైన సహాజ నటనతో ప్రేక్షకులతో పాటు దర్శక–నిర్మాతలను తన వైపుకు తిప్పుకుంటుంది సాయి పల్లవి. తండేల్ బ్లాక్ బస్టర్‌తో ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన నాచురల్ లుక్‌తో ఏకంగా రామయణ్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫర్ కొట్టేసింది.
Also Read: Kantara Movie: కాంతార: చాప్టర్ 1 విలన్‌కి డబ్బింగ్ చెప్పింది ఈ బిగ్‌బాస్ కంటెస్టెంటే.. తెలుసా?
బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కున్న బాలీవుడ్ రామయణ్లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమాకు సాయి పల్లవి రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందట. దక్షిణాది ఈ రేంజ్లో మార్కెట్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటి వరకు లేదు. ఇప్పటి నయన్కి ఈ మార్కెట్ ఉంది. కానీ, ఇప్పుడు ఏకంగా నయన్నే దాటేసి సాయి పల్లవి అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. ఇక రామయణ్ తర్వాత సాయి పల్లవి మరో రెండు సినిమాలు సైన్ చేసిందట. వీటి కోసం ఆమె రూ. 13 కోట్లు ఛార్జ్ చేసినట్టు సమాచారం. ఇలా చూస్తే.. దక్షిణాది అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఇప్పుడు సాయి పల్లవి నిలిచింది. దీంతో అంత నయనతాకు సాయి పల్లవి ఎసరు పెట్టేసిందే అంటూ ఆమె యాంటీ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.