Champion Release Date: ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ (Hero Roshan) ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. కానీ, చెప్పుకోదగ్గ హిట్, గుర్తింపు రాలేదు. ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన రోషన్.. 2021లో ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. మ్యూజికల్ పరంగా బ్లాక్‌బస్టర్ అందుకుంది. కానీ, థియేట్రికల్ పరంగా పెళ్లి సందD బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత రోషన్ చాలా రోజుల పాటు మరే సినిమాను ప్రకటించలేదు.
ఎలాగైన మంచి కమర్షియల్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో నాలుగేళ్లు గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’ చిత్రాన్ని ప్రకటిచాడు. ఈ ఏడాది రోషన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బర్త్డే సందర్భంగా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన మూవీ కాన్సెప్ట్ పోస్టర్, రోషనల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే మూవీ అనౌన్స్మెంట్, ఫస్ట్ పోస్టర్ తప్పితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో ఛాంపియన్ మూవీ గురించి రకరకాలు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా ఉందా? అనే అనుమానాలు కూడా వస్తున్న తరుణంలో మూవీ టీం తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఉన్నట్టుండి సడెన్ ఛాంపియన్ మూవీ రిలీజ్ డేట్ని ప్రకటించింది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూవీని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆట మొదలైంది. ‘ఛాంపియన్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చేసాడు’ అంటూ మేకర్స్ రిలీజ్ అప్డేట్ వదిలారు.
Also Read: Kantara Movie: కాంతార: చాప్టర్ 1 విలన్‌కి డబ్బింగ్ చెప్పింది ఈ బిగ్‌బాస్ కంటెస్టెంటే.. తెలుసా?
ఎట్టకేలకు ఛాంపియన్ మూవీ నుంచి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం రోషన్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు. మూవీ రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్ స్టైలిష్‌గా రాయల్గా కనిపించాడు. వింటేజ్ లుక్లో ఉన్న రోషన్ క్యూట్ స్మైల్‌తో ఫ్లైయిట్ నుంచి దిగుతున్నట్టు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read: Naga Chaitanya: నాన్నలాగే ఆ సినిమాలు చేయాలి.. అదే నా కల
The game begins. ⚽️#Champion is entering the field. ⚡️
Experience the epic journey in cinemas worldwide this 𝐃𝐞𝐜𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟓𝐭𝐡. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @AnandiArtsOffl @ConceptFilms_ @zeestudiossouth… pic.twitter.com/Ud2EaXz3WO
— Swapna Cinema (@SwapnaCinema) October 6, 2025