ప్రపంచాన్ని అబ్బుర పరిచే అద్భుతమైనా నిర్మాణాలు చేపడుతున్న చైనా.. మరో కళ్లు చెదిరే వంతెనను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆసియాలోనే మరో కనువిందు చేసే పర్యాటక ఆకర్షణను ఆవిష్కరించింది.గుయిజౌ ప్రావిన్స్ లోని హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను అధికారికంగా ప్రారంభించింది. బీపాన్ నదికి 625 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన.. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు తెచ్చుకుంది.
హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను నిర్మించడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. ఈ వంతెన దాదాపు 2,890 మీటర్ల పొడవు ఉంటుంది. మెయిన్ స్పాన్ 1,420 మీటర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి 1.87 బిలియన యువాన్లు (సుమారు రూ. 16.60 కోట్లు) ఖర్చు చేసింది. ఈ వంతెన స్టీల్ ట్రస్ సస్పెన్షన్ డిజైన్ గా నిర్మించారు. ట్రస్సులు దాదాపు 22,000 టన్నుల బరువును కలిగి ఉన్నాయి. ఈఫిల్ టవర్ల బరువు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఇది హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టగా ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో పూర్తి కానుంది. ఈ వంతెన రెండు నగరాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచనుంది.
⦿ గ్లాస్ ఎలివేటర్: ఈ వంతెనను ఉత్కంఠ భరితమైన ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఇందులోని హై స్పీడ్ గ్లాస్ లిఫ్ట్ పర్యాటకులను ఏకంగా వంతెన ఉపరితలం కంటే 2,600 అడుగుల ఎత్తులో ఉన్న రెస్టారెంట్ కు తీసుకెళ్తుంది. అక్కడ షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ పొడవైన స్తంభాలపై కాఫీ షాప్: నిటారుగా ఉన్న కొండలు, లోతైన లోయలు, పచ్చని కొండల నుండి ప్రవహించే గర్జించే జలపాతం. తేలియాడే మేఘాలు. కింద ఉప్పొంగుతున్న బీపాన్ నది అద్భుతమైన దృశ్యాలను చూస్తూ హాట్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చెయ్యొచ్చు. రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు.
⦿ గ్లాస్ వాక్ వే/అబ్జర్వేషన్ హాల్: టూరిస్టులు 1,900 అడుగుల ఎత్తైన గాజు వాక్ వే మీద నడిచే అవకాశం ఉంది. చక్కటి ఫోటోలను తీసుకోవచ్చు. గ్లోబ్ ట్రోటర్లు పూర్తిగా గాజుతో తయారు చేయబడిన 1,000 చదరపు మీటర్ల అబ్జర్వేషన్ హాల్ వీక్షణలను మరింత ఆహ్లాదాన్ని పంచుకుంది.
⦿ థ్రిల్లింగ్ ఈవెంట్స్: అడ్వెంచర్లను ఇష్టపడే వారికి ఇక్కడ బంగీ-జంపింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. థ్రిల్ కోరుకునే వారి కోసం తక్కువ ఎత్తులో ఉన్న స్కైడైవింగ్, పారాగ్లైడింగ్ సైట్లను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!
Read Also: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?