Nagachaitanya: సినీ నటుడు అక్కినేని నాగచైతన్య (Nagachaitanya)ప్రస్తుతం కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా నాగచైతన్య జగపతిబాబు(Jagapathi Babu)హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమురా (Jayammu Nischayammuraa)కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాల గురించి తన వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో జగపతిబాబు రాపిడ్ ఫైర్ సెషన్ భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడంతో నాగచైతన్య ఆసక్తికరమైన సమాధానాలను వెల్లడించారు.
నీకు ఇష్టమైన రెండు సినిమాలు ఏవి? 100 సార్లు చూసిన ఆ సినిమాలు బోర్ కొట్టవనే సినిమాలు ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ తన తండ్రి నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా(Ninne Pellaadutha) సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అదే విధంగా తన మామయ్య వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (Intlo Illaalu Vantintlo Priyuralu)సినిమా కూడా నాకు చాలా ఇష్టమని ఈ రెండు సినిమాలు ఎన్నిసార్లు చూడమన్నా చూస్తాను అసలు బోర్ కొట్టవు అంటూ సమాధానం ఇచ్చారు. నాగచైతన్య ఇలాంటి సమాధానం చెప్పడంతో అబ్బో రెండు సినిమాలు కూడా మీ వాళ్ళవే కదా అంటూ సరదాగా కామెంట్లు చేశారు.
ఇకపోతే ఇది లేకపోతే క్షణం కూడా ఉండలేను అని భావించేది ఏది అంటూ మరో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ శోభిత లేకపోతే ఒక క్షణం కూడా తాను ఉండలేనని శోభిత గురించి ఈయన సమాధానం ఇవ్వడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా నాగచైతన్య చెప్పిన సమాధానం పట్ల విభిన్న రీతిలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్య శోభితను రెండవ వివాహం చేసుకున్న నేపథ్యంలోనే ఈయన కామెంట్లపై కాస్త విమర్శలు కురిపిస్తున్నారు. నాగచైతన్య ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి శోభితను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వరుస ప్రాజెక్టులతో బిజీగా చైతూ…
ఇక నాగచైతన్య వ్యక్తిగత జీవితం పక్కన పెట్టే వృత్తిపరమైన విషయానికి వస్తే.. నాగచైతన్య చివరిగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న షూటింగ్ పనులలో నాగచైతన్య ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కొరటాల శివతో కూడా మరో సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా పట్ల ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం వెలువబడలేదు.
Also Read: Jayammu Nischayammuraa: సింగపూర్ క్రైమ్ లో కీర్తి సురేష్… సంతోషమే వేరన్న మహానటి!