Jayammu Nischayammuraa: జగపతిబాబు (Jagapathi Babu)వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది . ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తదుపరి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో భాగంగా మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే జగపతిబాబు ఎప్పటిలాగే ఈమెకు వరుస సర్ ప్రైజ్ ఇవ్వడమే కాకుండా ఈమెకు సంబంధించిన టాప్ సీక్రెట్స్ అన్ని కూడా బయటపెట్టారు.
మహానటి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. మహానటి బయోపిక్ సినిమాలో నటించావు ఇప్పుడు నీ బయోపిక్ సినిమాకు వద్దాము అంటూ జగపతిబాబు చెప్పగానే ఒకసారి గా కీర్తి సురేష్ అయ్యయ్యో అన్ని బయట పడిపోతాయి అంటూ షాక్ అయ్యారు. బయట నువ్వు పెద్ద మహానటివి అంటూ జగపతిబాబు అనడంతో మీకు మాత్రం మహానాటి అని అంటూ సరదాగా కీర్తి సురేష్ సమాధానం ఇచ్చారు. అలాగే తన స్కూల్ ఫోటోలను కూడా ఈ సందర్భంగా జగపతిబాబు చూయించినట్టు తెలుస్తుంది. ఇక కీర్తి సురేష్ దాదాపు 15 సంవత్సరాల పాటు ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా తన ప్రేమ వివాహం గురించి కూడా జగపతిబాబు మాట్లాడుతూ అయినా మీ ఇంట్లో ఇలా దశాబ్దాలు దశాబ్దాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అడగడంతో ఈ సీక్రెట్స్ అన్ని ఎవరో చెప్పినట్టు ఉన్నారు అంటూ కీర్తి షాక్ అవుతుంది. ఇక చిన్నప్పుడు పాకెట్ మనీ కావాలి అంటే ఈమె దొంగతనం చేసేదని ఈ సందర్భంగా జగపతిబాబు బయట పెట్టారు. అలా పాకెట్ మనీ దొంగతనం చేస్తే ఆ సంతోషమే వేరు అంటూ కీర్తి సురేష్ తెలియజేశారు. అదేవిధంగా సింగపూర్లో ఏదో క్రైమ్ లో ఇరుక్కున్నావట కదా అంటూ జగపతిబాబు ప్రశ్నించారు.
ఇలా సింగపూర్ క్రైమ్ గురించి కూడా ఈ ప్రోమోలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరి సింగపూర్ లో ఎలాంటి సంఘటన జరిగింది? అసలు ఈమె క్రైమ్ లో చిక్కుకోవడం ఏంటి? అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం జీ తెలుగులో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్లు ప్రసారం కాగా ఈ ఎపిసోడ్లకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి. కీర్తి సురేష్ తదుపరి ఎపిసోడ్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరిగా వెండితెర పై దసరా సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించారు అనంతరం చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు.. ఇక ఇటీవల సుహాస్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఉప్పుకప్పురంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.. ఇక ప్రస్తుతం ఈమె హీరో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన్ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!