E-Paper
Advertisement

నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. ఓటర్ ఐడీల వివాదంలో నాన్-బెలెబుల్ వారెంట్!

నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. ఓటర్ ఐడీల వివాదంలో నాన్-బెలెబుల్ వారెంట్!
Advertisement

Prakash Raj Warrant: బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు (మల్టిపుల్ ఓటర్ ఐడీలు) కలిగి ఉన్నారనే ఆరోపణల వివాదంలో ఆయనపై బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బెలెబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పదే పదే బేఖాతరు చేయడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Read also-బాక్సాఫీస్ పెహల్వాన్ ‘పెద్ది’.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ఎప్పుడంటే!

నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ కార్డులు!

Advertisement

భారతదేశ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక ఓటర్ ఐడీ కార్డు ఉండాలి. కానీ, ప్రకాష్ రాజ్ నిబంధనలకు విరుద్ధంగా దక్షిణ భారతదేశంలోని నాలుగు కీలక రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు లలో ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

Read also-మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్ చరణ్, క్లిన్ కారా..

కోర్టు ఆగ్రహానికి కారణం ఇదే..

Advertisement

ఈ అక్రమాలపై దిలీప్ కుమార్ అనే వ్యక్తి బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గతంలో ప్రకాష్ రాజ్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేస్తూ, కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆయన ఆ నోటీసులను లెక్కచేయకుండా, విచారణకు హాజరుకాకుండా దూరంగా ఉండిపోయారు. నిందితుడు పదే పదే సమన్లను తిరస్కరిస్తూ కోర్టుకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, ఈసారి నేరుగా నాన్-బెలెబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. ఈ వారెంట్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ త్వరలోనే కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది, లేనిపక్షంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×