E-Paper
Advertisement

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!
Advertisement

Rashmika Injury:గత మూడు, నాలుగు రోజులుగా రష్మికకు ఏమైంది అని ఆందోళన పడుతున్న అభిమానులకు అసలు విషయం చెప్పుకొచ్చింది రష్మిక.”అవును.. గాయాలు అవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనుకున్నా.. చివరికి తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడోసారి” అంటూ రష్మిక పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తుంటి భాగంలోని టెండన్ పూర్తిగా 

మన శరీరంలో తుంటి భాగం నుంచి కాలును కలిపే టెండన్స్ చాలా ముఖ్యమైనవి.ఒకసారి అవి దెబ్బతింటే నడవడమే కాదు.. కాలు పైకి ఎత్తడం కూడా కష్టమవుతుంది.అలాంటి టెండన్స్‌లో ఒకటి పూర్తిగా ఊడిపోయిందని చెప్పుకొచ్చింది రష్మిక.

Advertisement

“నా తుంటి భాగంలో కాలును కలిపే నాలుగు టెండన్స్‌లో ఒకటి ఊడిపోయింది. ఇప్పుడు నేను కాలు పైకి ఎత్తాలి అనుకున్నా అది మళ్లీ అతుక్కోవాలి. డాక్టర్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు” అంటూ అసలు విషయం వెల్లడించింది.

‘మైసా’ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం

ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా రష్మిక వెల్లడించింది.తన కొత్త సినిమా ‘మైసా’ షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తుండగా ఈ గాయం అయిందని తెలిపింది.ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా నొప్పి ఎక్కువ కావడంతో వెంటనే షూటింగ్ ఆపేసినట్లు చెప్పింది.

Advertisement

మొదట చిన్న గాయం అనుకున్నప్పటికీ.. స్కాన్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడిందని, వెంటనే చికిత్స ప్రారంభించామని వివరించింది.

కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సినిమా

సినిమా గురించి మాట్లాడుతూ..తాను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘మైసా’నే చాలా కష్టమైన సినిమా అని, శరీరాన్ని పూర్తిగా పరీక్షించే సినిమా ఇదేనని చెప్పుకొచ్చింది.ఫిజికల్ ట్రైనింగ్ ప్రతిరోజూ ఒక కొత్త ఛాలెంజ్‌లా అనిపించిందని, ఈ సినిమా కోసం తన లిమిట్స్ కూడా దాటిపోయానని వెల్లడించింది.

ఈ గాయం నాకు ఒక పెద్ద పాఠం 

“బహుశా నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలని దేవుడే ఇలా అవకాశం ఇచ్చాడేమో. ఎప్పుడూ షూటింగ్‌లు, ట్రావెలింగ్, ఈవెంట్స్ అంటూ గ్యాప్ లేకుండా పరుగులు తీస్తున్నాను. ఇకపై నా బాడీని మిషన్‌లా కాకుండా మనిషిలా చూసుకోవాలని ఈ గాయం నాకు నేర్పించింది” అంటూ రష్మిక చెప్పిన మాటలు అభిమానులను ఎమోషనల్‌కు గురిచేస్తున్నాయి.

త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు

రష్మిక పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే అభిమానులు భారీగా స్పందిస్తున్నారు.”ముందు ఆరోగ్యం… తర్వాత సినిమా”, “త్వరగా కోలుకోండి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

డూప్ లేకుండా యాక్షన్ 

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రష్మిక నెలల తరబడి ప్రత్యేక శిక్షణ తీసుకుందట.డూప్ లేకుండా చాలా సన్నివేశాలను తనే చేయాలని నిర్ణయించుకోవడంతో, ఆ రిస్క్ కారణంగానే ఈ గాయం జరిగి ఉండొచ్చని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

రష్మిక మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు?

పూర్తిగా కోలుకుని త్వరలోనే మళ్లీ యాక్టివ్ అవుతానని రష్మిక చెబుతోంది.మరి అభిమానులు ఎదురుచూస్తున్నట్టుగా ఆమె ఎప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమా సెట్స్‌పైకి అడుగుపెడుతుందో చూడాలి.

Tags

Related News

ఈసారి అయినా హిట్ కొడతావా నితిన్?

టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

సౌత్ స్టైల్‌లో ‘స్పైడర్ మ్యాన్’కు పెళ్లి.. అతిథులుగా అవేంజర్స్, ఏం క్రియేషన్ భయ్యా!

Big Stories

Advertisement
×