E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

బాక్సాఫీస్ పెహల్వాన్ ‘పెద్ది’.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ఎప్పుడంటే!

బాక్సాఫీస్ పెహల్వాన్ ‘పెద్ది’.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ఎప్పుడంటే!
Advertisement

Peddi Event Hyderabad: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రం, తాజాగా మరో భారీ సెలబ్రేషన్‌కు సిద్ధమైంది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయానికి కృతజ్ఞతగా, అభిమానుల సమక్షంలో జూన్ 23వ తేదీన (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని ప్రముఖ ‘శిల్పకళా వేదిక’ లో ఒక భారీ ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన స్పెషల్ ఇన్విటేషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

Read also-విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ‘కత్తి లాంటి ఐడియా’ వీడియో వైరల్!

Advertisement

ఈ క్రేజీ ఈవెంట్ పోస్టర్‌లో రామ్ చరణ్ రగ్గడ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లాంగ్ హెయిర్, దట్టమైన గడ్డం, పవర్‌ఫుల్ మజిల్స్‌తో ‘పెహల్వాన్’ అవతారంలో చరణ్ కనిపిస్తున్నారు. ఆయన ధరించిన జెర్సీపై “PEDDI 27” భారత జాతీయ పతాకం స్పష్టంగా ఉన్నాయి. చేతిలో గోల్డ్ మెడల్ పట్టుకుని, తీవ్రమైన హావభావాలతో ఉన్న చరణ్ లుక్ సినిమాలోని ఆయన పాత్ర తీవ్రతకు అద్దం పడుతోంది. సుమారు రూ.250-350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, 2026 టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి ఇటీవల చిత్రబృందం దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల అదనపు సీన్లను కూడా జత చేయడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మరింత పుంజుకున్నాయి.

Read also-‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..

Advertisement

వృద్ధి సినిమాస్ (వెంకట్ సతీష్ కిలారు) నిర్మాణంలో, మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, ఆర్. రత్నవేలు విజువల్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేటర్లలో రచ్చ లేపుతున్న ఈ చిత్రం ఓటీటీ బిజినెస్‌లోనూ సంచలనం సృష్టించింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సుమారు రూ.105 కోట్ల భారీ ధరకు దీని డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. జూలై ఆఖరులో రాబోయే ఈ ఓటీటీ వెర్షన్‌లో థియేటర్ కట్స్ కూడా కలిపి, ఏకంగా 3 గంటల 25 నిమిషాల ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రస్తుతానికి అందరి కళ్లూ జూన్ 23న జరగబోయే శిల్పకళా వేదిక ఈవెంట్‌పైనే ఉన్నాయి.

Related News

ఇండియన్ ఫేవరెట్ సూపర్‌హీరో ఈజ్ బ్యాక్.. తేజ సజ్జ ‘హనుమాన్’ 3D ట్రైలర్ విడుదల!

నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. ఓటర్ ఐడీల వివాదంలో నాన్-బెలెబుల్ వారెంట్!

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ‘కత్తి లాంటి ఐడియా’ వీడియో వైరల్!

నెట్టింట వైరల్‌గా మారిన జాన్వీ కపూర్ ‘నైట్‌సూట్’ పిక్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా?

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్ చరణ్, క్లిన్ కారా..

బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ ఎంతంటే?

‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..

Big Stories

×