Nithiin Comeback: అన్నీ ఉన్నాయి.. అందం, డబ్బు, టాలెంట్… లేనిదేదీ లేదు. కానీ వీటితోపాటు బోలెడంత దురదృష్టాన్ని కూడా వెంటపెట్టుకొని తిరుగుతున్నాడు నితిన్.
అవును.. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ తర్వాత ఇప్పటికీ ఒక్క సాలిడ్ హిట్ కాదు.. మామూలు హిట్ కూడా పడలేదు. దీంతో ఇప్పటికైనా ఒక్క హిట్ కొట్టు గురువు అంటూ ఆశపడుతున్నారు నితిన్ ఫ్యాన్స్.
చేసిన ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మాచర్ల నియోజకవర్గం’ ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయాయి.ఇక ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములతో అయినా హిట్ వస్తుందని ఆశగా ఎదురుచూసి చేసిన ‘రాబిన్ హుడ్’ ఎటెళ్లిపోయాడో కూడా తెలియలేదు.
ఇక దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ‘తమ్ముడు’ అసలు సోదిలో లేకుండా పోయాడు.దీంతో సినిమా తీయడాలేనా.. లేక అసలు హిట్ కొట్టడం ఏమైనా ఉందా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఏకిపారేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే నేచురల్ స్టార్ నాని బ్యానర్లో ‘ఆలియాస్ రుక్మిణి’ అంటూ మరో కొత్త సినిమాకి తెర తీశాడు.‘దండోరా’ దర్శకుడు మురళి కాంత్ దేవ సోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ అయింది.అది చూస్తే కొత్తగానే ఉంది. కానీ ఆ గ్లింప్స్ చూసిన తర్వాత కూడా తమ ట్రోల్స్ ఆపడం లేదు నెటిజన్లు.
గ్లింప్స్ సూపర్‌గానే ఉంది. టైటిల్ కొత్తది.. చూస్తుంటే కథ కూడా కొత్తగానే ఉంది.కానీ రిజల్ట్ మాత్రం పాతదిలా ఉండకూడదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నిజానికి నితిన్‌లో టాలెంట్ లేదని ఎవరు అనరు. కానీ కథల సెలక్షన్ దగ్గరే బోల్తా పడుతున్నాడు.ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు.. “ఇది డిఫరెంట్ స్టోరీ”, “ఈసారి సూపర్ హిట్ అవుతుంది” అనే మాటలు వినిపిస్తున్నాయి.కానీ రిలీజ్ తర్వాత మాత్రం అన్నీ అట్టర్ ఫ్లాపులుగానే మిగిలిపోతున్నాయి.
ఇప్పుడు ‘ఆలియాస్ రుక్మిణి’ కూడా అదే పరిస్థితిలో ఉంది.వదిలిన గ్లింప్స్ బాగుంది. చూస్తుంటే కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తుంది.మరోవైపు నాని నిర్మాతగా ఉండటం ఈ సినిమాకి ప్లస్.కానీ ఆడియన్స్ మాత్రం ఇప్పుడు గ్లింప్స్ చూసి థియేటర్లకు వచ్చే రోజులు పోయాయి.కచ్చితంగా మౌత్ టాక్ సాలిడ్‌గా రావాల్సిందే.
ఈ సినిమా కనుక కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే.. నితిన్‌ను ఆదుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు.సో.. ఒకరకంగా ఈ సినిమా నితిన్‌కు డూ ఆర్ డై అనే చెప్పాలి.చూడాలి మరి.. గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన నితిన్.. రిలీజ్ రోజు వాటిని అందుకుంటాడో లేదో!
also read:రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!