E-Paper
Advertisement

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

హీరోయిన్‌గా నందమూరి  తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?
Advertisement

Tejaswini Debut:నందమూరి ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తానంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట నందమూరి తేజస్విని. ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా సర్కులేట్ అవుతోంది.

ఇక ఈ వార్త ఇలా బయటకొచ్చిందో లేదో.. “మా బాలయ్య కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది” అంటూ మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు.

తేజస్వినిని డైరెక్ట్ చేసేది ఎవరు?

Advertisement

ఇక గత కొంతకాలంగా నందమూరి తేజస్వినిని డైరెక్ట్ చేసేది ఎవరా అంటూ ఆరాలు తీస్తున్న మూవీ లవర్స్‌కి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ దొరికేసింది.అవును.. నందమూరి తేజస్వినికి దర్శకత్వం వహించేది ఒక లేడీ డైరెక్టర్ అని టాక్ వినిపిస్తోంది.

లక్ష్మీ సౌజన్యతో లేడీ ఓరియెంటెడ్ సినిమా?

తను ఎవరో కాదు.. ‘వరుడు కావలెను’ సినిమాతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ సౌజన్య.ఆమె తేజస్విని కోసం ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ కథను రెడీ చేసిందని, ఆ కథను తేజస్వినికి వినిపించగా ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో కథ

Advertisement

ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. కథ మాత్రం మహిళా పాత్ర చుట్టూనే తిరుగుతుందట.యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ రిలేషన్స్.. ఇలా అన్ని అంశాలను కలిపి లక్ష్మీ సౌజన్య ఈ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

తేజస్విని కోసం కథలో మార్పులు?

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తేజస్విని కోసం ప్రత్యేకంగా కథలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.తేజస్విని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా పాత్రను తీర్చిదిద్దుతున్నారని, సంప్రదాయ విలువలతో పాటు మోడ్రన్ థాట్స్ కలిగి ఉన్న మహిళ పాత్రలో ఆమెను చూపించాలని లక్ష్మీ సౌజన్య ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు.

మొదటి సినిమాపై పూర్తి ఫోకస్

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని ఉద్దేశంతో.. కథ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదట తేజస్విని.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం 

అయితే ఈ వార్తలపై అటు తేజస్విని నుంచి కానీ, ఇటు నందమూరి బాలకృష్ణ నుంచి కానీ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడే ఈ సినిమాకు ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు.

ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై ఉత్కంఠ

మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగానే తేజస్వినిని లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తారా..? లేక మరో దర్శకుడు లేదా దర్శకురాలు ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తారా అనేది చూడాలి.మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తేజస్విని ఎంట్రీపై భారీ అంచనాలు

ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే.. ఇన్నాళ్లు కెమెరా వెనుక కనిపించిన తేజస్విని.. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మొత్తానికి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కుమార్తెలు, సినీ కుటుంబాలకు చెందిన వారసులు ఇండస్ట్రీలోకి రావడం కామన్ అయిపోయింది.

ముఖ్యంగా పెద్ద హీరోల కుటుంబాల నుంచి వచ్చే వారిపై భారీ అంచనాలు ఉండడం సహజం. మరి ఆ అంచనాలను తేజస్విని అందుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

ALSO READ:రెండు పెళ్లిళ్లు.. కేసులు.. క్యాన్సర్‌..ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ తెలుసా?

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×