E-Paper
Advertisement

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!
Advertisement

Heroine Phobias:హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా సినిమాల్లో విలన్లను ఎదిరించిన వాళ్లే. కానీ నిజ జీవితంలో వాళ్లకి చిన్న చిన్న భయాలు ఉంటాయని మీకు తెలుసా?కోట్ల మంది అభిమానుల ముందు ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించే స్టార్ హీరోయిన్లకు కూడా మనలాగే కొన్ని ఫోబియాలు ఉంటాయని మీరు ఊహించారా?

మరి మనకు తెలిసిన ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో.. వాళ్లకు ఉన్న ఆ వింత భయాలు ఏంటో ఒకసారి చూద్దాం.

విద్యా బాలన్‌కు పిల్లులంటే ఫోబియా

Advertisement

ముందుగా విద్యా బాలన్ విషయానికి వస్తే.. సినిమాల్లో ఇంత బోల్డ్‌గా, రెబల్‌గా కనిపించే ఈ వెటరన్ బ్యూటీకి పిల్లి అంటే మహా భయమట.సాధారణంగా కుక్కలంటే ఎక్కువ మందికి భయం ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ భామకి పిల్లులంటే ఫోబియా అని గత కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పింది.ఇక ఎక్కడైనా పిల్లి కనిపిస్తే అక్కడి నుంచి సెకన్లలో మాయం అవుతుందట.

ఇలా ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత రెబల్‌గా ఉన్నా.. విద్యా బాలన్‌కు మాత్రం ఈ వింత ఫోబియా పోవట్లేదట.

ప్రియాంక చోప్రాకు గుర్రపు స్వారీ అంటే భయం

Advertisement

ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో యాక్షన్ సినిమాలు చేసి అదరగొట్టిన ఈ స్టార్‌కి గుర్రపు స్వారీ అంటే చాలా భయమట.ఒక సినిమా షూటింగ్ కోసం గుర్రం ఎక్కాల్సి రావడంతో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుందట.

సన్నీ లియోన్‌కు పురుగులంటే వణుకు

ఇక తనదైన గ్లామర్‌తో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సన్నీ లియోన్.. చిన్న చిన్న పురుగులు కనిపిస్తే వెంటనే కేకలు వేస్తుందట.ముఖ్యంగా బొద్దింకలు, సాలీడులు కనిపిస్తే అవి ఉన్న ప్రాంతంలో అస్సలు ఉండలేదట.

అనుష్క శర్మకు బైక్ రైడ్ అంటే భయం

ఇక సినిమాల్లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేసినా.. రియల్ లైఫ్‌లో మాత్రం బైక్ రైడ్ చేయాలంటేనే భయపడుతుందట అనుష్క శర్మ.ముఖ్యంగా బైక్‌పై వేగంగా వెళ్లడం అంటే మహా భయమట.అందుకే అవసరమైతే తప్ప బైక్ రైడ్స్‌ను ప్రిఫర్ చేయదట ఈ బీటౌన్ బ్యూటీ.

దీపికా పదుకొణెకు లిఫ్ట్ అంటే భయం

ఇక తనదైన సినిమాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న దీపికా పదుకొణెకు లిఫ్ట్ అంటే మహా భయమట.అవును.. క్లోజ్డ్‌గా ఉండే రూమ్‌లలో ఒక్క నిమిషం కూడా ఉండలేనని గత ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారి గనుక సడన్‌గా ఆగిపోతే ఏం చేయాలనే ఆలోచనే తనని టెన్షన్‌కు గురి చేస్తుందట.అందుకే తప్పదు అనుకుంటే తప్ప మెట్లనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుందట దీపిక.

కత్రినా కైఫ్‌కు టమాటాలంటే భయం?

ఇక అందరూ లిఫ్ట్లు, బైక్లు, పిల్లులకు భయపడితే.. కత్రినా కైఫ్ మాత్రం టమాటాలకు భయపడిపోతుందట.వినడానికి కామెడీగా ఉన్నా ఇది నిజమేనని చాలా కాలంగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.కత్రినా కైఫ్‌కు టమాటాలతో షూటింగ్ చేయాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుందట. అయితే ఈ విషయాన్ని కత్రినా స్వయంగా చెప్పకపోయినా.. చాలా కాలంగా ఇదే అంశంపై బీటౌన్‌లో చర్చ జరుగుతూనే ఉంది.

ఆలియా భట్‌కు చీకటి అంటే భయం

ఇక నాకు మాత్రం చీకటి అంటే మహా భయం అంటుంది ఆలియా భట్.ఇప్పటికీ రాత్రి పడుకునే సమయంలో కచ్చితంగా లైట్ వేసుకునే పడుకుంటుందట.తాను ఎంత పెద్ద స్టార్ అయినా.. ఈ విషయంలో మాత్రం తన భయం పోవట్లేదని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

సోనం కపూర్‌కు కూడా లిఫ్ట్ అంటే భయమే

ఇక నాకు దీపికలాగే లిఫ్ట్ అంటే మహా భయం అంటుంది సోనం కపూర్.మూసివేసి ఉన్న లిఫ్ట్‌లో ప్రయాణించడం అంతగా ఇష్టం ఉండదని, చాలాసేపు లిఫ్ట్‌లో ఉంటే పానిక్ అయిపోతానని చెప్పుకొచ్చింది.అందుకే మెట్లనే ఎక్కువ ప్రిఫర్ చేస్తానని, పైగా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదని ఉచిత సలహా ఇస్తుంది.

స్టార్ హీరోయిన్లకూ చిన్న చిన్న భయాలు

ఏది ఏమైనా.. సినిమాల్లో రెబల్‌గా, వైల్డ్‌గా, బోల్డ్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మలు.. నిజ జీవితంలో మాత్రం ఇలా చిన్న చిన్న వాటికే భయపడటం నిజంగా ఆశ్చర్యమే కదా!

also read :పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

Tags

Related News

ఈసారి అయినా హిట్ కొడతావా నితిన్?

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!

టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

సౌత్ స్టైల్‌లో ‘స్పైడర్ మ్యాన్’కు పెళ్లి.. అతిథులుగా అవేంజర్స్, ఏం క్రియేషన్ భయ్యా!

Big Stories

Advertisement
×