Renu Desai : ప్రముఖ టాలీవుడ్ సినీ నటి , కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న రేణు దేశాయ్(Renu Desai), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య అయిన ఈమె.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఏదో విషయంపై స్పందిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్.. పెళ్లికి ముందే అఖీరా నందన్ కు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత ఆధ్యకు జన్మనిచ్చిన ఈమె కొంతకాలం కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి పిల్లల్ని తీసుకొని ముంబై వెళ్ళిపోయిన రేణు దేశాయ్.. అక్కడే సెటిలైపోయింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంటున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది . పలు అంశాలపై స్పందిస్తూ అటు తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ ఇలా కామెంట్ పెట్టాడు.” వదిన గారు మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే చాలా బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండానే విడిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది.. డెస్టినీ అన్నింటినీ డిసైడ్ చేస్తుంది. అయితే పిల్లలు మాత్రం అన్నయ్యతో ఉన్నారు అది చాలు వదిన.. కానీ మేము మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నాం” అంటూ ఒక సుదీర్ఘ పోస్టు పంచుకున్నారు.
also read:బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?
అయితే ఈ వ్యాఖ్యలకు రేణు దేశాయ్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. “మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. వదిలేసి పెళ్లి చేసుకుంది నేను కాదు.. ఆయన.. దయచేసి నన్ను ఇంకా టార్చర్ పెట్టకండి.. ఇలాంటి కామెంట్స్ తో ఎన్నిసార్లు చెప్పాలి” అంటూ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చింది రేణు దేశాయ్. ఇకపోతే తాను పవన్ కళ్యాణ్ ను వదిలి వెళ్ళిపోలేదని.. పవన్ కళ్యాణ్ తనను వదిలేసి మరో వివాహం చేసుకున్నారని ఇప్పటికే రేణు దేశాయ్ ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే సదరు నెటిజన్ ఈ విషయం తెలిసో లేక తెలియక అన్నారో తెలియదు కానీ ఇప్పుడు ఆయన అన్న మాటలకు రేణు దేశాయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

ఇకపోతే రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఆ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.