Prasanth Varma: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు పైకి లేపుతారో.. ఎవరిని కిందకు తొక్కుతారో ఎవరికి తెలియదు. ఇక ఒకరు పైకి ఎదుగుతున్నారు అంటే వారిని కిందకు దించడానికి చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఒకరి మీద ఆరోపణలు వచ్చాయి అంటే అతని కెరీర్ ఇక అయ్యిపోయినట్లే. వెంటనే ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి. లేదు అంటే కెరీర్ లో సక్సెస్ ను అందుకోవడం చాలా కష్టంఅవుతుంది. గత రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సంచలన ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే.
హనుమాన్ లాంటి భారీ హిట్ తరువాత ప్రశాంత్ వర్మ టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. టాలీవుడ్ నిర్మాతలంతా వర్మ దగ్గరికి క్యూ కట్టారు. అలా వచ్చిన నిర్మాతలను వెనక్కి పోనివ్వకుండా మీకు సినిమా చేస్తా.. మీకూ కూడా సినిమా చేస్తా అని దాదాపు 10 సినిమాలను లైన్లో పెట్టాడట.అంతేనా అడ్వాన్స్ కూడా తీసుకొని మరీ అగ్రిమెంట్ రాశాడట. డీవీవీ దానయ్య కుమారు కళ్యాణ్ హీరోగా అధీరతో పాటు సీతాకోక చిలుక, అక్టోపస్, మహాకాళి, జై హానుమాన్, బ్రహ్మరాక్షసుడు సినిమాలతో పాటు ఇంకో అరడజను సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమాల నుంచి వచ్చిన అడ్వాన్సులు మొత్తం కలిపి వంద కోట్లకు పైగా వచ్చాయంట. సరే డాబు తీసుకున్నవాడు సినిమాలు చేయాలికదా. ఉన్నది ఒక్కడు.. ఒకేసారి 10 చోట్ల ఉండాలి.. 10 సినిమాలు చేయాలి అంటే ఎలాకుదురుతుంది. పోనీ ఒకదాని తరువాత ఒకటి మొదలుపెట్టాలన్నా ఏళ్లు దాటిపోతుంది. మరి అన్ని తెలిసి వర్మ ఇన్ని సినిమాలను ఎలా ఒప్పుకున్నాడు అంటే.. అక్కడే ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. డైరెక్షన్ తాను చేయను అని, కథ మాత్రం అందిస్తాను అనిచెప్పుకొచ్చాడు . ఇది నిర్మాతలకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో అందరూ కలిసి ఒకేసారి దండయాత్ర చేశారు. ఇది వర్మపై వచ్చిన ఆరోపణ.
నిజం చెప్పాలంటే ఇదేమి చిన్న ఆరోపణ కాదు. నిజం అని తెలిస్తే వర్మ లైఫ్ ఖతం. ఈ డబ్బు మొత్తాన్ని స్టూడియో మీద పెట్టేశాడని, ఇప్పుడు సినిమాలు చేయడం తప్ప వర్మకు వేరే ఛాయిస్ లేదు అని టాక్. నిజంగా అదే అయితే అన్ని సినిమాలు ఒక్కడే చేయగలడా.. అసలు ఈ రేంజ్ లో ఆరోపణలు వచ్చినా కూడా ఇంకా ఈ కుర్ర డైరెక్టర్ సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి. అంటే ఆ పుకార్లు నిజమేనా.. ? ఏ నమ్మకంతో అంత డబ్బు తీసుకొని.. నిర్మాతలను మోసం చేశాడు. అసలు ఏ నమ్మకంతో నిర్మాతలు అయినా వర్మకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కనుక వర్మ బయటకు వచ్చి నోరు విప్పకపోతే ముందు ముందు అతడిని ప్రజలు కూడా నమ్మడం మానేస్తారు అని చెప్పొచ్చు. అవి నిజాలు కాకపోతే బయటకు వచ్చి.. ఇందులో ఏది వాస్తవం కాదు అని చెప్పకుండా సైలెంట్ గా కూర్చుంటే సమస్య సమసిపోతుందా అని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి వర్మ ఇప్పటికైనా నోరు విప్పుతాడా లేదా అనేది చూడాలి.