Kasibugga Temple : శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు ముఖ్య కారణం.. కార్తీక శుక్ల ఏకాదశి వైకుంఠవాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.. దీంతో ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే భక్తులు మెట్లపై ఎక్కుతుండగా ఒకరికొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా రెయిలింగ్ పడిపోయింది. దీంతో ఒకరిమీద ఒకరు పడి ఊపిరిఆడక మహిళ భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలయ అధికారులు భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.