Champion Teaser : టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు.. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాలో నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా అతని నటనకు ప్రశంసలు దక్కాయి.. రోషన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఛాంపియన్ ‘.. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను , జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతుంది.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళతో ఆట ఆడితే ఎలా ఉంటుందో అన్నది జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
రోషన్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ‘ఛాంపియన్ ‘ మూవీ నుంచి తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు.. అ టీచర్ బ్రిటిష్ వాళ్లతో ఒక పెద్ద యుద్ధంలాగా కనిపిస్తుంది.. బాల్ తీసుకొని వెళ్తా గోల్ కొడతా అన్న డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. గుర్రాల మీద బ్రిటిష్ వాళ్ళు రోషన్ పెద్ద వార్ లాగా కనిపిస్తుంది.. బ్యాగ్రౌండ్ చూస్తుంటే యుద్ధ వాతావరణంలా ఉంది.. ఆ తర్వాత రోషన్ నా పేరు మైఖేల్ అంటూ పరిచయం చేసుకుంటూ ఫుట్ బాలు ఆడుతూ కనిపిస్తాడు.. టీజర్ లోని ప్రతి సీను గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఈ మూవీతో రోషన్ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వేసుకునేలా కనిపిస్తున్నాడు..
Also Read :బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేట్ అతనే..? ఓటింగ్ రివర్స్.. విన్నర్ ఎవరంటే..?
‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పెళ్లి సందడి మూవీ లో నటించారు.. ఈ మూవీలో రోషన్ నటనకు మార్కులు పడ్డాయి. లవర్ బాయ్ గా కనిపించిన రోషన్ ఇప్పుడు యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ చాంపియన్.. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. ఫస్ట్ లుక్ ,గ్లింప్స్ పాజిటివ్ టాక్‌ను అందుకున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగు శరవేగంగా జరుగుతుంది. తాజాగా మూవీ నుంచి బయటికి వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రోషన్ సరసన కోలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ జోడిగా నటిస్తుంది. ఈ మూవీని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లోకి రాబోతుంది.