Baahubali: The Epic First Day Collection: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ నిన్న రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 2015లో విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీ రిలీజై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. రెండు భాగాలను ఎడిట్ చేసి ఒక్క భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలను ఎలా కట్ చేశారు, అవుట్ పుట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది.
పైగా బాహుబలి లాంటి సినిమా రీ రిలీజ్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. దీంతో ఈ సినిమా తొలి రోజు భారీ ఒపెనింగ్స్ ఇచ్చింది. రీ రిలీజ్తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు చాలా థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. దీంతో ఫస్ట్ డే ఈ చిత్రం భారీ ఒపెనింగ్స్ ఇచ్చింది. తొలి రోజు ఈ సినిమా రూ. 10.4 కోట్ల పైనే నెట్ రాబ్టటినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. అలాగే గ్రాస్ పరంగా చూస్తే రూ. 18 కోట్లు పైనే వసూళ్లు చేసిందట. దీంతో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రీ రిలీజ్ సినిమాలు ఈ రేంజ్లో కలెక్షన్స్ చేసింది లేదు.
ఇది కేవలం బాహుబలితోనే సాధ్యం అయ్యింది. పదేళ్ల క్రితం బాక్సాఫీసు అత్యధిక వసూళ్లతో సంచలనం రేపిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్లోనూ బాక్సాఫీసు దుమ్ము రేపింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల్లో తోలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దళపతి విజయ్ ‘గిల్’ రూ. 10 కోట్ల గ్రాస్తో ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రూ. 8 కోట్ల గ్రాస్, మహేష్ బాబు బిజినెస్మెన్ రూ. 5.27 కోట్ల గ్రాస్, మురారి రూ. 5 కోట్ల గ్రాస్తో టాప్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డ్స్ అని బ్రేక్ చేసి బాహుబలి కొత్త రికార్డుతో టాప్లో నిలిచింది.
Also Read: Prasanth Varma: ఫిల్మ్ ఛాంబర్ కి ప్రశాంత్ వర్మ పంచాయితీ… డబ్బులు రిటన్ ఇస్తాడా?
కాగా ప్రభాస్, రానా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బాహుబలి: ది బిగినింగ్ పేరుతో 2015లో విడుదల చేశారు. ఆ తర్వాత బాహుబలి: ది కన్క్లూజన్ ని 2017లో విడుదలైంది. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లపైనే వసూళ్లు చేసింది. రెండో పార్ట్ వరల్డ్ వైడ్గా రూ. 1800 పైగా కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హయ్యేస్ట్ గ్రాస్ చిత్రంలో ఒకటిగా నిలిచింది. పుష్ప ముందు వరకు దంగల్ (రూ. 2000 కోట్ల గ్రాస్) తర్వాత సెకండ్ హయ్యేస్ట్ గ్రాస్ బాహుబలి: ది కన్క్లూజన్ ఉంది. దీన్ని పుష్ప 2 చిత్రం అధిగమించి రూ. 1813 పైగా కోట్ల గ్రాస్ టాప్లో ఉంది. ఇప్పుడు బాహుబలి 2 మూడో స్థానంలో ఉంది.