Andhra King Taluka Shooting: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా.. గత కొద్ది రోజులుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో ఖాతాలో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అంత ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ఇవాల్టితో గుమ్మడికాయ కొట్టేయబోతున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ ను నేటితో పూర్తి చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ని ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. సినిమా రిలీజ్ అయ్యేందుకు కేవలం 27 రోజులు మాత్రమే ఉండడంతో ఇవాళ షూటింగ్ని పూర్తిచేసే పనిలో చిత్రయూనిట్ ఉన్నారు. ఇవాళ కోకాపేట స్టూడియోలో షూటింగ్ జరగనుంది.. ఇవాల్టితో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి రేపటి నుంచి సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చింది..
Also Read :ఫిట్ నెస్ కోచ్ తో హీరో ప్రేమాయణం.. లైఫ్ లో ఊహించని ట్విస్టులు..
హీరో రామ్ కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు.. దీంతో కంటెంట్ పై కాస్త ఫోకస్ చేసి జాగ్రత్తలు తీసుకొని మరి ఆంధ్ర తాలూకా సినిమాలో నటిస్తున్నాడు హీరో. ఇందులో హీరోయిన్ గా రవితేజ బ్యూటీ భాగ్యం శ్రీ నటిస్తుంది.. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ అయిన చిన్ని గుండెల్లోనా అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంటుంది.. రామ్ – భాగ్యశ్రీ జంట మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందని కామెంట్స్ వినిపించాయి. అంతేనా బయట కూడా వీరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఉన్నాయి. తాజాగా విడుదలైన సాంగ్లో వీరిద్దరూ నిజంగానే ప్రేమికులేమో అన్న డౌట్ కూడా జనాలకు కలుగుతుంది. మొత్తానికి సాంగ్ అదిరిపోయింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది. సాంగ్స్ తోనే సినిమాపై హైప్ పెంచుతున్నారు. అప్డేట్స్ తో పాటుగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందేమో చూడాలి.. ఈ సినిమా మాత్రం హిట్ అయితే రామ్ ట్రాక్ మళ్ళీ యూ టర్న్ తీసుకున్నట్లే.. మరి ఏం జరుగుతుందో? ఎలాంటి టాక్ని అందుకుంటుందో? తెలియాలంటే ఈనెల 28 వరకు వెయిట్ చేయాల్సిందే…