Tamannah bhatia:దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి ఈ ఏడాది ఒక మర్చిపోలేని ఏడాది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది విజయ్ వర్మ (Vijay Varma) కి బ్రేకప్ చెప్పేసింది. ప్రేమలో ఉన్నవారికి బ్రేకప్ జరిగితే ఆ బాధ ఎంతలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది అయితే డిప్రెషన్ లోకి కూడా వెళ్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇలా బ్రేకప్ లు జరిగితే ఆ బాధ మర్చిపోవడానికి ఎక్కువ సినిమాలు చేస్తూ లేక ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది తమన్నా కూడా అలాంటి సిచ్యువేషన్ నే ఫేస్ చేసింది. తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పడంతో వార్తల్లో నిలిచింది.
అయితే ఇప్పటివరకు విజయ్ వర్మతో బ్రేకప్ అయిన విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినప్పటికీ తమన్నా, విజయ్ వర్మల మధ్య ఉన్న దూరంతో అందరికీ అర్థమయిపోయింది. అయితే తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు దుమారం సృష్టిస్తున్నాయి.. అంతేకాదు తమన్నా, విజయ్ వర్మల బ్రేకప్ కు కారణం కూడా ఇదే కావచ్చు అని చాలామంది భావిస్తున్నారు. మరి ఇంతకీ తమన్నా ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం. తమన్నా తాజాగా బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఈ ఇంటర్వ్యూలో తమన్నాకి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది.మీకు ఎలాంటి మనుషులు అంటే ఇష్టం ఉండదు. ఎలా ఉండకూడదు అని ప్రశ్న ఎదురయింది.
తమన్నా ఏమాత్రం ఆలోచించకుండా..” రెగ్యులర్ గా అబద్ధాలు చెప్పేవారంటే నాకు అస్సలు నచ్చదు.కొంతమంది మొహం మీదే అబద్ధాలు చెప్పేస్తారు. అలాంటి వారిని నేను ఎప్పటికీ ఇష్టపడను.. మన పక్కనే ఉంటూ ఎన్నో మాయ మాటలు చెప్పి మనల్ని పిచ్చివాళ్ళని చేస్తారు. అలాంటి వారిని ఎప్పటికీ సహించను.ఇలా రెగ్యులర్ గా అబద్ధాలు చెబుతూ మోసం చేసే వారిని నేను హ్యాండిల్ చేయలేను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తమన్నా.. ప్రస్తుతం తమన్నా ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి. తమన్నా ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మను ఉద్దేశించే అని.. విజయ్ వర్మ తమన్నాతో రిలేషన్ లో ఉన్నప్పుడు అలా ప్రవర్తించడం వల్లే తమన్నా విసిగిపోయి పరోక్షంగా ఈ కామెంట్లు చేసిందని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు తమన్నా తో విజయ్ వర్మ ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటే ఆమె ఈ మాటలు మాట్లాడుతుంది.అందుకే బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ కట్ చేసుకుంది కావచ్చు అంటూ చాలామంది భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ తమన్నా ఇలా ఇంటర్వ్యూ ద్వారా పరోక్షంగా తన బ్రేకప్ కి కారణం చెప్పేసింది అని మాట్లాడుకుంటున్నారు. ఇక తమన్నా – విజయ్ వర్మల ప్రేమాయణం లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగినట్టు వార్తలు వినిపించాయి.అలా 2023లో వీరి మధ్య లవ్ స్టార్ట్ అయితే 2025 మొదట్లో వీరు విడిపోయినట్టు వార్తలు వినిపించాయి. తమన్నా బ్రేకప్ తర్వాత కూడా సౌత్, నార్త్ లో పలు సినిమాలు చేస్తూ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్ లు కూడా చేస్తుంది. ఇక తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో ప్రేమలో పడ్డారనే రూమర్లు వినిపించాయి.అంతేకాదు ఈ రూమర్లకు తగ్గట్టుగానే ఫాతిమా సనా షేక్, విజయ్ వర్మ ఇద్దరూ రెస్టారెంట్లకు వెళ్లడం.. క్లోజ్ గా ఫోటోలకు ఫోజులిచ్చిన వీడియోలు,ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.