Shambhala Trailer: ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆది. నటుడు సాయి కుమార్ వారసుడిగా తెలుగుతెరకు పరిచయమైన ఆది.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే అతని బ్యాడ్ లక్.. ఆ సినిమా తప్ప ఇప్పటికీ ఒక మంచి హిట్ అందుకోలేకపోయాడు. అయినా కూడా ఇండస్ట్రీపై యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అంటూ విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతూనే వస్తున్నాడు.
ట్రెండ్ కి తగ్గట్లు.. జానర్ మారుస్తూనే వస్తున్నాడు. యాక్షన్ అయితే యాక్షన్.. కామెడీ అయితే కామెడీ.. ఇక ఇప్పుడు హారర్ జానర్ కి శాస్త్రాన్ని జోడించి సరికొత్తగా శంబాల అంటూ వస్తున్నాడు. ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శంబాల. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది సరసన అర్చన నాయర్ నటిస్తుంది.
ఇప్పటికే శంబాల నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాతో ఆది మంచి హిట్ అందుకుంటాడు అనే నమ్మకాన్ని ఇస్తుంది ట్రైలర్. ” కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి జరిగిన ఒక భీకర యుద్ధం.. ఈ కథకు మూలం” అంటూ సాయి కుమార్ బేస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది.
ఆకాశం నుంచి ఒక అగ్ని రాయి .. ఒక ఊరిలో పడుతుంది. అది ఏంటి అనేది అటు శాస్త్రానికి.. ఇటు సీంస్ కి అంతు చిక్కదు. దీంతో సైన్స్ ను తప్ప శాస్త్రాన్ని నమ్మని విక్రమ్ ను ఆ రాయి ఏంటి.. ? దానివలన ఆ ఊరులో ఏం జరుగుతుందో తెలుసుకోమని అధికారులు పంపుతారు. విక్రమ్.. ఆ రాయి సైన్స్ కి కూడా అంతు చిక్కడం లేదని, తానే ఆ చిక్కుముడిని విప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో విక్రమ్ ఎదుర్కున్న సమస్యలు ఏంటి.. ? అసలు ఆ అగ్గి రాయి కథ ఏంటి.. ? చివరకు ఆ ఊరును వల్లకాడు కాకుండా విక్రమ్ ఆపగలిగాడా.. ? అనేది సినిమా కథగా తెలుస్తోంది.
ట్రైలర్ ని బట్టి ఈ కథ 90 వ దశకంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆది డ్రెసింగ్.. లొకేషన్స్ అన్ని అలానే కనిపిస్తున్నాయి. ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్ కట్ చేసిన విధానం.. ఆ విజువల్స్ చూపించిన విధానం చాలా అంటే చాలా బావున్నాయి. ఇక శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న శంబాల ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా ఆది మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.