E-Paper
Advertisement

Prashanth Neel: మైత్రి నిర్మాణంలో ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీ.. పూజా కార్యక్రమాలు పూర్తి!

Prashanth Neel: మైత్రి నిర్మాణంలో ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీ.. పూజా కార్యక్రమాలు పూర్తి!
Advertisement

Prashanth Neel: సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా కొనసాగుతున్న ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడంతో ఈయన ప్రస్తుతం వరుస సౌత్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరుత ఈయన ప్రభాస్ సలార్ సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ (NTR)డ్రాగన్(Dragon) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ప్రశాంత్ నీల్ సమర్పణలో..

ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీల్ మరొక కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ సమర్పణలో క్రితన్ నంద గౌడ్ (Kirtannanda gouda)దర్శకత్వంలో హను రెడ్డి , సూర్య రాజ్, ప్రీతి పగడాలో కాంబినేషన్లో సినిమా అని ప్రకటించారు. ఈ సినిమా హర్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తాజాగా చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

హర్రర్ సినిమా..

Advertisement

ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను మైత్రి మూవీ మేకర్స్ అధికారకంగా షేర్ చేస్తూ.. భయపడాలి అనుకునే వారికి ముఖ్యంగా ఎవరైతే భయపడకూడదు అనుకుంటారు. అలాంటి వారికోసం అద్భుతమైన హర్రర్ సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడిగా పని చేస్తున్న క్రితన్ నంద గౌడ్ ఇదివరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్, కేజీఎఫ్ సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.

Advertisement

ఇక ప్రస్తుతం ఈయన దర్శకుడిగా హర్రర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో పనిచేసిన హను రెడ్డి(Hanu Reddy) ఇదివరకు 8 వసంతాలు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రీతి పగడాల(Preethi Pagadala) కూడా పతంగ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా జరుపుకోనుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన కే జి ఎఫ్ 3, సలార్2 పనులలో బిజీ కానున్నారు.

Also Read: IBomma Ravi: మూవీరూల్జ్ హెల్ప్‌తోనే ఐబొమ్మ రవి ఇలా చేశాడు… వెలుగులోకి సంచనల నిజాలు

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×