E-Paper
Advertisement

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు!

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు!
Advertisement

Prathyusha Case:2002లో సంచలనం సృష్టించిన ప్రముఖ సినీ నటి ప్రత్యూష (Prathyusha ) మృతి కేసు ఈరోజు కొలిక్కి వచ్చేసింది. సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది.. సిద్ధార్థ రెడ్డి పిటీషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ.. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ.. నిందితుడు సిద్ధార్థ రెడ్డిని నాలుగు వారాలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో గత 24 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రత్యూష తల్లి సరోజినీ దేవికి భారీ ఉపశమనం లభించింది. తన కూతురికి న్యాయం జరగాలి అంటూ పోరాడిన ఆ తల్లి పోరాటానికి నేడు ప్రతిఫలం లభించింది.. తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు.. ఆధారాలను పరిశీలించిన తర్వాత వారికి అనుకూలంగా తీర్పునిస్తూ.. నిందితుడిని లొంగి పోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యూష కేసులో వెలువడిన ఈ తీర్పు హర్షదాయకం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంతోషంలో ప్రత్యూష తల్లి..

తన కూతురిది ఆత్మహత్య కాదు అని, నలుగురు వ్యక్తులు తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని , నిందితులకి తప్పకుండా శిక్ష విధించాలని ఆ దేవుడే శిక్ష విధిస్తాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ప్రత్యూష తల్లికి నేడు పూర్తిగా ఉపశమనం లభించింది. దేవుడు కరుణించి ఆమె కూతురికి అనుకూలంగా తీర్పును అందించారు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే నాలుగు వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించారు. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు తుది తీర్పుతో ప్రత్యూష తల్లి సంతోషంలో మునిగితేలుతున్నారు.

Advertisement

also read:Actress Trisha: ఏం జరిగినా నిన్ను విడిచిపెట్టను.. త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

అసలేం జరిగింది?

2002 ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రంప్రత్యూష తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డి తో కలిసి కూల్ డ్రింకులో పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నంలో ప్రత్యూష ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందగా.. సిద్ధార్థ రెడ్డి మాత్రం బయటపడ్డారు. అయితే దీనిపై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఖండించింది . తన కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అని, తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ పోలీసుల ఎదుట తన గోడును వెల్లబోసుకుంది. ఇక దాంతో పోలీసులు రంగంలోకి దిగి సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేశారు.

Advertisement

నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాదు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువేల జరిమానా విధించారు. దాంతో సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షణ సవాల్ చేస్తూ.. శిక్ష పెంచాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సరోజినీ దేవి.. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గత ఏడాది నవంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది.

2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని లేదా సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో ప్రత్యూష తరఫు వాదనలు వినిపించారు. ఇక సుదీర్ఘ విచారణల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×