Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. పటాన్ చెరువు నుండి కొల్లూరు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కారులో ఉన్న ఆరుగురుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటైనర్ అతివేగంతో కారును ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం.. మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం
స్థానిక పోలీసులు, ట్రాఫిక్ విభాగం ప్రమాదం జరిగిన ప్రదేశంలో.. సర్వే ప్రారంభించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ రూట్‌లో వేగపరిమితులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచనలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.