OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ లను ఇష్టపడే వాళ్లకి, సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇచ్చే ఒక గ్రిప్పింగ్ సిరీస్ రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది నాలుగు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రతి క్షణం ఉత్కంఠంగా సాగుతుంది. ఈ సిరీస్ ఒక మైండ్ గేమ్ లా ప్లే అవుతుంది. ఈ కథ ఒక యజమాని, పని మనిషి చుట్టూ తిరుగుతుంది. ఒక మిస్టరీ ఛేదించే దిశగా ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘The Guest’ 2025లో BBCలో విడుదలైన బ్రిటిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. యాష్లీ వే దీనికి దర్శకత్వం వహించారు. 4 ఎపిసోడ్‌ల ఈ సిరీస్, ప్రతి ఒక్కటి దాదాపు 60 నిమిషాల నిడివిని కలిగిఉంది. ఇందులో ఇమున్ ఎలియట్, సియోన్ డానియల్ యంగ్, జూలియన్ లూయిస్ జోన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 సెప్టెంబర్ 1 నుంచి BBC iPlayer, BBC One Wales లో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో ఈ సిరీస్‌కు 6.7/10 రేటింగ్ ఉంది.
రియా అనే యువతి ఒక క్లీనర్‌గా పనిచేస్తూ, ఎక్కువ డబ్బు సంపాదించాలని, మంచి జీవితం జీవించాలని ఆశపడుతుంది. ఆమెకు ఒక రోజు ఫ్రాన్ అనే ధనవంతురాలు పరిచయమవుతుంది. రియాని తన దగ్గరే ఉద్యోగంలో నియమిస్తుంది. రియాతో ఫ్రాన్ ఒక యజమానిలా కాకుండా, సన్నిహితంగా ఉంటూ, ఆమె జీవితాన్ని మార్చాలని చూస్తుంది. మొదట్లో రియాకి ఈ దగ్గరి సంబంధం బాగుందనిపిస్తుంది. కానీ త్వరలోనే ఫ్రాన్ గురించి సందేహాలు మొదలవుతాయి. ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఫ్రాన్ మెంటాలిటీ క్రమంగా బయటపడుతుంది. గతంలో ఫ్రాన్‌తో పనిచేసిన అన్నా అనే మరో అమ్మాయి గురించి రియా తెలుసుకుంటుంది. ఆమె ఇక్కడ హఠాత్తుగా కనిపించకుండా పోతుంది. ఈ రహస్యం రియాను బాగా భయపెడుతుంది. ఫ్రాన్‌తో ఆమె సంబంధం ఒక ప్రమాదకరమైన మైండ్ గేమ్‌గా మారుతుంది.
కథ ముందుకు నడుస్తున్న కొద్దీ, ఫ్రాన్ గురించి తెలుసుకోవడానికి రియా ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి అడుగులో కొత్త ట్విస్ట్‌లు ఎదురవుతాయి. ఫ్రాన్ చూడటానికి అమాయకురాలిగా కనిపిస్తుంది. కానీ ఆమె వ్యక్తిత్వం రియాను ఒక మాయలో పడేస్తుంది. అన్నా గురించి రియా తెలుసుకున్నప్పుడు, ఆమెకు తాను కూడా అదే గేమ్‌లో భాగమైనట్లు అనిపిస్తుంది. ఇప్పుడు రియా తన తెలివితేటలతో ఈ సీక్రెట్ ను ఛేదించి, ఫ్రాన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి పోరాడుతుంది. చివరికి ఫ్రాన్ గురించి రియా ఏం తెలుసుకుంటుంది ? అన్నా మిస్సింగ్ వెనుక అసలు సీక్రెట్ ఏమిటి ? రియా ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పద్దుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకొండి.
Read Also : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు