Sandeep Kishan : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పేరు అందరికి తెలిసే ఉంటుంది. టాలెంటెడ్ హీరో అయినా కూడా లక్ కలిసిరాకపోవడంతో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో పడలేదు. డిఫరెంట్ కంటెంట్తో సినిమాలు చేస్తున్న సరే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాలు పెద్దగా ఆడలేకపోతున్నాయి.. ఈయన నటించిన భైరవకోన సినిమా కాస్త మెప్పించిన సరే కలెక్షన్ల పరంగా పెద్దగా వసూళ్లను సాధించలేదు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో పవర్ఫుల్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు సందీప్ కిషన్.. ప్రస్తుతం ఆయన ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఆ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.. ఆ లుక్ ఎలా ఉంది..? టైటిల్ ఏంటో చూసేద్దాం..
సందీప్ కిషన్, యంగ్ డైరెక్టర్ జాన్సన్ సంజయ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ సిగ్మా అని ఫిక్స్ చేశారు. అలాగే సందీప్ కిషన్ పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. డబ్బులు, బంగారం కూర్చున్నాడు. అంతేకాదు చేతిలో కర్చీఫ్, ఒంటినిండా గాయాలతో కనిపిస్తున్నాడు. దాంతో ఈ మూవీ భారీ యాక్షన్ కథతో రాబోతుందని అర్థమవుతుంది. మొత్తానికి ఈ మూవీతో భారీ యాక్షన్ హీరోగా సందీప్ మారబోతున్నాడు. ఇప్పటివరకు కాస్త లవర్ బాయ్ గా కనిపించిన హీరో కంప్లీట్ గా యాక్షన్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి..
Also Read : భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న రవితేజ మూవీ.. ఎన్ని కోట్లంటే..?
సందీప్ కిషన్ కొత్త డైరెక్టర్స్ కు ఎక్కువగా కొత్త డైరెక్టర్ల తో సినిమాలు చేస్తుంటాడు.. అయితే అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మరోసారి ఈ కుర్ర హీరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ డైరెక్టర్ మరెవ్వరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తనయుడు సంజయ్ జాన్సన్తో సందీప్ కిషన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సంజయ్ తో సినిమా తెలుగులో ఎలా ఉన్నా తమిళ్ లో మాత్రం కచ్చితంగా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.. ఈ మూవీని తెలుగులో, తమిళ్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం.. తమిళ్ లో చాలామంది యువ హీరోలు ఉన్నా కూడా.. సంజయ్ ఏరికోరి తెలుగు యాక్టర్ తో సినిమా చేయడం పట్ల ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. నిజానికి సంజయ్ సందీప్ కిషన్ కి ఫ్రెండ్ అని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.. సంజయ్ మొదటి సినిమాని యాక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తున్నాడు.. తాజాగా విడుదలైన పోస్ట్ అని చూస్తుంటే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళబోతుందని తెలుస్తుంది.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..
Presenting the Title of #JSJ01 – #SIGMA⚡
The quest begins. 🎯@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @Cinemainmygenes @krishnanvasant @Dir_sanjeev #BenjaminM @hariharalorven @ananth_designer @SureshChandraa @UrsVamsiShekar… pic.twitter.com/Dggm6zx3Il— Lyca Productions (@LycaProductions) November 10, 2025