BigTV English

Breakfast: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌

Breakfast: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌

Breakfast: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలనే నిర్ణయానికి వచ్చింది.


ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లపై విద్యా శాఖ దృష్టి
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ కూడా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోని అన్ని సర్కారు బడుల్లోని విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. పీఎం పోషణ్ స్కీమ్‌లో భాగంగా అల్పాహారం అందించాలని విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల కోసం విద్యాశాఖ, కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది.

బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ పెడితే సర్కార్ బడుల్లో విద్యార్థలు సంఖ్య పెరిగే అవకాశం..
తెలంగాణలో దాదాపు 24 వేల పైచిలుకు ప్రభుత్వ స్కూళ్లున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 19 లక్షల మంది ఉంటారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. తద్వారా సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు సైతం అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించారు. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో భాగంగా తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో పీఎం పోషణ్ స్కీమ్‌లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంపై విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.


Also Read: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

21వేల కోట్లతో 105 పాఠశాలలను నిర్మించాలని లక్ష్యం..
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని అమలుచేశారు. దాదాపు నెల రోజుల పాటు ఇది కొనసాగింది. కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఈ స్కీమ్ ను అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కానీ కొద్దిరోజులకే ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆపై విద్యారంగంపై సీఎం ప్రత్యేక దృష్టిసారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను, సమగ్ర అభివృద్ధిని అందించే లక్ష్యంతో తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21వేల కోట్ల వ్యయంతో 105 పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది.

Related News

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

BJP Candidate: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Telangana Maoist Surrender: ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు-డీజీపీ

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా

Hyderabad News: హైదరాబాద్‌‌‌ను వణికిస్తున్న జంతువులు.. మొన్న కొండ చిలువ, ఇప్పుడు 12 అడుగుల భారీ మొసలి

Big Stories

×