Eng-W vs SL-W: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 11 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ 12వ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ మహిళల జట్టు వర్సెస్ శ్రీలంక ( England Women vs Sri Lanka Women )మధ్య ఫైట్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇంగ్లాండ్ కంటే శ్రీలంకకు ఈ మ్యాచ్ చాలా కీలకము. పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ కొలంబో ప్రేమదాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo ) వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే టాస్ ప్రక్రియ రెండున్నర గంటలకే ఉంటుంది. జియో హాట్ స్టార్ ( Jio Hot star) అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ( Star Sports ) మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు తిలకించవచ్చు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే, మహిళల ఆస్ట్రేలియా జట్టు నెంబర్ వన్ స్థానంలో ఉంది. మూడు మ్యాచ్లు ఆడి రెండిటిలో గెలిచిన ఆస్ట్రేలియా 5 పాయింట్లు సాధించింది. ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొదటి స్థానంలోకి దూసుకు వెళ్ళింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత ఇంగ్లాండు రెండో స్థానంలో ఉండగా టీమిండియా మూడు అనంతరం సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ ఐదవ స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ ఆరవ స్థానంలో నిలిచాయి. శ్రీలంక ఏడో స్థానంలో ఉండగా పాకిస్తాన్ చిట్టచివరన నిలిచింది. పాకిస్తాన్ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్లు ఆడింది. ఈ మూడు మ్యాచ్ లలో అత్యంత దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్ ( Pakistan Team). టీమిండియా ( Team India)చేతిలో కూడా ఒక ఓటమి ఉంది.
శ్రీలంక జట్టు అంచనా: హాసిని పెరెరా, 2 చమరి అతపత్తు (కెప్టెన్), 3 హర్షిత్ సమరవిక్రమ, 4 విష్మి గుణరత్నే, 5 కవిషా దిహారి, 6 నీలక్షిక డి సిల్వా, 7 అనుష్క సంజీవని ( WK), 8 సుగండిక కుమారి, 8 సుగండిక కుమారి, 9 A, ప్రఖ్యాత కుమారి, 9 A. 11 ఇనోకా రణవీర
ఇంగ్లండ్ జట్టు అంచనా: 1 టామీ బ్యూమాంట్, 2 అమీ జోన్స్ (వారం), 3 హీథర్ నైట్, 4 నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), 5 సోఫియా డంక్లీ, 6 ఎమ్మా లాంబ్, 7 ఆలిస్ క్యాప్సే, 8 చార్లీ డీన్, 9 సోఫీ ఎక్లెస్‌స్టోన్, 10 లిన్సేల్ 10 లిన్సే
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
New Zealand moves up to 5th spot after their win against Bangladesh. 🫡#Cricket #NZvBAN #CWC #Sportskeeda pic.twitter.com/xXcqwxO8PX
— Sportskeeda (@Sportskeeda) October 10, 2025